Deepak Saroj : మహేష్ ‘అతడు’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోగా అర్జున్ రెడ్డి రేంజ్ సినిమా..

మహేష్ బాబు అతడు సినిమా ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. ఈ సినిమాలో బ్రహ్మానందం కొడుకుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్.

Deepak Saroj : మహేష్ ‘అతడు’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోగా అర్జున్ రెడ్డి రేంజ్ సినిమా..

Mahesh Babu Athadu Movie Child Artist Deepak Saroj coming as Hero with Siddharth Roy Film

Updated On : January 24, 2024 / 8:01 AM IST

Deepak Saroj : చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు పెద్దయ్యాక కూడా హీరో, హీరోయిన్స్ గానో లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో సినిమాలు కంటిన్యూ చేస్తారు. ఇప్పటికే చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు ప్రస్తుతం హీరో, హీరోయిన్స్ గా దూసుకుపోతున్నారు. బలగం సినిమాతో కావ్య హీరోయిన్ గా వరుస సినిమాలు కొట్టేస్తుంది. ఇటీవలే హనుమాన్ సినిమాతో ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ తేజ సజ్జ నేషనల్ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు ఇదే కోవలో మరో చైల్డ్ ఆర్టిస్ట్ హీరోగా వచ్చేస్తున్నాడు.

మహేష్ బాబు అతడు సినిమా ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. త్రివిక్రమ్ చేసిన మ్యాజిక్ తో ఇప్పటికి టీవీలో టీఆర్పీలు బద్దలుకొడుతుంది అతడు సినిమా. ఈ సినిమాలో బ్రహ్మానందం కొడుకుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్. సినిమాలో హీరో ఆ ఫ్యామిలీకి వచ్చినప్పుడు ఫస్ట్ చూసేది ఇతనే. అతడు సినిమాలో దీపక్ చాలా సీన్స్ లో కనిపిస్తాడు. అప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకొని పలు సినిమాల్లో నటించాడు.

Also Read : RGV : ఆ శ్రీదేవి ఫోటో నన్ను ఏడ్చేలా చేసింది.. ఆర్జీవీ ఎమోషనల్ ట్వీట్.. ఏంటా ఫొటో?

దీపక్ సరోజ్ ఇప్పుడు హీరోగా రాబోతున్నాడు. కొత్త డైరెక్టర్ యశస్వి దర్శకత్వంలో దీపక్ సరోజ్ హీరోగా రాబోతున్న సినిమా సిద్దార్థ్ రాయ్(Siddharth Roy). నిన్నే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కూడా చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే అందరికి అర్జున్ రెడ్డి, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలే గుర్తుకు వచ్చాయి. ఆ రేంజ్ బోల్డ్, ఎమోషన్ కంటెంట్ తో రాబోతున్నాడు దీపక్. త్వరలోనే సిద్దార్థ్ రాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందు రానున్నాడు. మరి ఈ సినిమాతో హీరోగా కూడా పేరు తెచ్చుకొని దీపక్ సరోజ్ వరుసగా సినిమాలు చేస్తాడేమో చూడాలి.