RGV : ఆ శ్రీదేవి ఫోటో నన్ను ఏడ్చేలా చేసింది.. ఆర్జీవీ ఎమోషనల్ ట్వీట్.. ఏంటా ఫొటో?
సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ కూడా శ్రీదేవికి పెద్ద ఫ్యాన్ అని తెలిసిందే. ఎన్నో వందల సార్లు ఆర్జీవీ ఈ విషయం చెప్పాడు. శ్రీదేవిని ప్రేమించానని, ఆమెని ఎంతగా ఆరాధించాడో కూడా చెప్పాడు.

Ram Gopal Varma
RGV : దివంగత స్టార్ హీరోయిన్ శ్రీదేవి(Sridevi) సౌత్, నార్త్ అని తేడా లేకుండా అన్ని భాషల్లో సినిమాలు చేసి కోట్లాదిమంది అభిమానులని సంపాదించుకుంది. ముఖ్యంగా అబ్బాయిలు ఆమె అందానికి ఫిదా అయ్యారు. సెలబ్రిటీలు సైతం ఆమెకు అభిమానులే. సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ కూడా శ్రీదేవికి పెద్ద ఫ్యాన్ అని తెలిసిందే. ఎన్నో వందల సార్లు ఆర్జీవీ ఈ విషయం చెప్పాడు. శ్రీదేవిని ప్రేమించానని, ఆమెని ఎంతగా ఆరాధించాడో కూడా చెప్పాడు. శ్రీదేవితో కలిసి ఆర్జీవీ రెండు సినిమాలు తీసాడు కూడా. వారిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది.
Also Read : Dunki Collections : షారుఖ్ ‘డంకీ’ కష్టాలు.. 500 కోట్లు కలెక్ట్ కాకుండానే థియేటర్స్ నుంచి అవుట్..?
అప్పుడప్పుడు శ్రీదేవి ప్రస్తావన తన ఇంటర్వ్యూలలో కానీ, సోషల్ మీడియాలో కానీ తీసుకొస్తూ ఉంటాడు. తాజాగా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్(AI) తో తయారుచేసిన ఓ శ్రీదేవి ఫోటోని ఆర్జీవీ షేర్ చేసి.. ఆ ఆర్టిఫిషియాల్ ఇంటిలిజెన్స్ శ్రీదేవి నన్ను ఏడ్చేలా చేసింది అని పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలో శ్రీదేవి చాలా అందంగా ఉండటంతో ఆర్జీవికి శ్రీదేవి గుర్తొచ్చి ఏడ్చాడు అనే అర్ధంలో పోస్ట్ చేసాడు. దీంతో ఆర్జీవీ పోస్ట్ వైరల్ గా మారింది.
ఇక ఆర్జీవీ పోస్ట్ కి కొంతమంది నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఆర్జీవీ కూడా ఏడుస్తాడా? ఆర్జీవికి ఎమోషన్స్ ఉన్నాయా? శ్రీదేవి గుర్తొచ్చిందా? తాగి పోస్ట్ చేసావా.. అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.