Guppedantha Manasu : జగతి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. దేవయాని, శైలేంద్రకు షాకుల మీద షాకులు

రిషి, వసుధర ఫణీంద్ర ఇంటికి వెళ్తారు. తాను ఒకరిని పరిచయం చేయబోతున్నట్లు రిషి వారికి చెబుతాడు. రిషి ఫణీంద్ర కుటుంబానికి పరిచయం చేసిన కొత్త వ్యక్తి ఎవరు? 'గుప్పెడంత మనసు' సీరియల్‌లో ఏం జరిగింది?

Guppedantha Manasu

Guppedantha Manasu : రిషి ఫణీంద్రకు ఒక వ్యక్తిని పరిచయం చేయాలి అంటాడు. ఫణీంద్ర ఇంటికి వచ్చిన ఆ వ్యక్తి ఎవరు? ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో కొత్త క్యారెక్టర్ ఎంట్రీతో ఏం జరగబోతోంది?

Guppedantha Manasu : రిషి, వసుధరల ఫస్ట్ నైట్.. జగతి వారికి బిడ్డగా పుట్టాలని కోరుకున్న మహేంద్ర..

జగతి కేసును డీల్ చేయడానికి అపాయింట్ అయిన ఇన్విస్టిగేషన్ ఆఫీసర్ ముకుల్‌ను ఫణీంద్రకు పరిచయం చేస్తాడు రిషి. దేవయాని, శైలేంద్ర ముకుల్‌ని చూసి బిత్తరపోతారు.  ముందుగా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే బావుంటుందని ముకుల్‌కి సూచిస్తుంది వసుధర. మా ఫ్యామిలీ మెంబర్స్‌ని ఇంటరాగేట్ చేయాల్సిన అవసరం లేదు అంటుంది దేవయాని.  శత్రువులెవరైనా ఉన్నారా? అంటే.. ఎమ్మెస్సార్ ఉన్నాడు కదా అంటుంది వసుధర. ఎమ్మెస్సార్ గురించి అడిగిన ముకుల్‌కి గతంలో కాలేజీని దక్కించుకోవడం కోసం అతను చేసిన పనులు చెబుతారు. అయితే అతను హత్య చేసేంత దుర్మార్గుడు అనుకోవట్లేదు అంటాడు రిషి ముకుల్‌తో.

తన భర్త ఇండియాకి వచ్చిన తర్వాత రిషిపై అటాక్స్ జరగడం మొదలయ్యాయని అంటుంది ధరణి. ధరణి మాటలకు శైలేంద్ర, దేవయాని ఉలిక్కిపడతారు. తన భార్య అమాయకంగా ఏదో మాట్లాడుతోందని సర్ది చెప్పబోతాడు శైలేంద్ర. అమాయకురాలు కాబట్టే నిజం చెబుతోందని వసుధర సెటైర్ వేస్తుంది. ఏది ఏమైనా అతి త్వరలోనే నేరస్తుల్ని పట్టుకుంటానని రిషికి హామీ ఇస్తాడు ముకుల్. ఈ కేసును పర్సనల్‌గా ఇన్విస్టిగేట్ చేస్తున్నాను అంటాడు. అందుకు అందరూ సహకరించాలని కోరతాడు. ముకుల్ ఎటువంటి సమాచారం అడిగిన హెల్ప్ చేయమని ఫణీంద్ర కుటుంబానికి చెప్తాడు రిషి. తనకు అన్ని వేళలా తోడుగా నిలిచిన వసుధరకు రిషి థ్యాంక్స్ చెబుతాడు. మన మధ్య ఉన్న తీయని జ్ఞాపకాల్ని ఎప్పటికీ మనం మరిచిపోకూడదు అంటాడు.

Guppedantha Manasu : హనీమూన్‌లో మరింత దగ్గరైన రిషి, వసుధర.. వాళ్లెక్కడ ఉన్నారో శైలేంద్రకు తెలిసిపోయిందా?

శైలేంద్ర తమ ఎత్తులన్నీ బెడిసి కొడుతుండటం తట్టుకోలేక తనని తాను బెల్ట్‌తో కొట్టుకుంటాడు. కొడుకు అలా చేయడం చూసి దేవయాని షాకవుతుంది. కొడుకుని మందలిస్తుంది. అప్పుడే కాఫీ కప్పుతో అక్కడికి వచ్చిన ధరణిపై దేవయాని, శైలేంద్ర మండిపడతారు. శైలేంద్ర గురించి ముకుల్ దగ్గర అలా మాట్లాడావేంటని ధరణిపై దేవయాని మండిపడుతుంది. ముకుల్ ఎంట్రీతో శైలేంద్ర, దేవయాని ఎత్తులకు చెక్ పడనుందా? నెక్ట్స్ ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. ముకేష్ గౌడ, రక్ష గౌడ, సాయి కిరణ్, జ్యోతి రాయ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌ను కాపుగంటి రాజేంద్ర డైరెక్ట్ చేస్తున్నారు.