Guppedantha Manasu : రిషి, వసుధరల ఫస్ట్ నైట్.. జగతి వారికి బిడ్డగా పుట్టాలని కోరుకున్న మహేంద్ర..
మహేంద్ర జగతి జ్ఞాపకాల నుంచి నెమ్మదిగా బయటకు వస్తాడు. రిషి, వసుధరలను జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటాడు. రిషి, వసుధరల ఫస్ట్ నైట్ కోసం హోటల్ రూమ్‌ని డెకరేట్ చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Guppedantha Manasu
Guppedantha Manasu : మహేంద్రలో మార్పు మొదలవుతుంది. నెమ్మదిగా జగతి జ్ఞాపకాల నుంచి బయటకు వస్తాడు. మరోవైపు శైలేంద్ర వసుధరకి ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తాడు. వాటిని వసుధర ఎలా తిప్పి కొట్టింది?
శైలేంద్ర వసుధరకి ఫోన్ చేసి మీరు ఎక్కడ ఉన్నా కనిపెట్టగలను అంటాడు. ధరణి నంబర్ నుంచి చాట్ చేసి కనిపెట్టారని తనకు తెలుసు అంటుంది వసుధర. పిచ్చి ప్రయత్నాలు మానేసి సైలెంట్‌గా ఏదైనా జాబ్ చేసుకోమని చెబుతుంది. ఎప్పటికీ ఎండీ సీటు శైలేంద్రకు దక్కదని చెబుతుంది. వసుధర మాటలకు కోపంతో రగిలిపోయిన శైలేంద్ర ఫోన్ పెట్టేస్తాడు.
రిషి తనపై అటాక్ చేసిన వారెవరని ఆలోచిస్తాడు. తనకి తెలియకుండా శత్రువులు ఎవరు ఉన్నారని అనుకుంటాడు. ఎలాగైనా వారిని కనిపెట్టాలని డిసైడ్ అవుతాడు. హాలీడేస్ అయిపోయినా ఇంకా రిషి, వసుధర వాళ్లు ఊళ్లోకి రాకపోవడం ఏంటని వారికి ఫోన్ చేసి రప్పించమని తండ్రి ఫణీంద్రతో అంటాడు శైలేంద్ర. వాళ్లు ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్లారని.. వాళ్లని తాను రమ్మని పిలవనని చెబుతాడు. రిషి తనకి టచ్‌లో ఉన్నాడని, రోజూ ఫోన్ చేసి మాట్లాడుతున్నాడని అనడంతో దేవయాని, శైలేంద్ర షాకవుతారు.
రిషిపై కొత్తగా ఎటువంటి అటాక్‌లకు ప్లాన్ చేయవద్దని దేవయాని శైలేంద్రకు చెబుతుంది. ఒకవైపు జగతిపై అటాక్ చేసిన వారి గురించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోవద్దని.. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా శైలేంద్రని కాలేజీ ఎండీని చేస్తానని మాటిస్తుంది దేవయాని. తల్లి మాటలకి సరే అంటాడు శైలేంద్ర.
రిషి, వసుధరలను సరదాగా బయట తిరిగి రమ్మంటాడు మహేంద్ర . ఈ వయసులో కాక ఇంకెప్పుడు జీవితాన్ని ఎంజాయ్ చేస్తారని అంటాడు. వాళ్లు బయటకు వెళ్లగానే హోటల్‌లో వారి శోభనానికి ఏర్పాట్లు చేస్తాడు. జగతి జ్ఞాపకాలలో పడి తాగుడుకు బానిసై రిషి, వసుధరలను పట్టించుకోలేదని.. ఇకపై వారిని జాగ్రత్తగా చూసుకుంటానని బాధపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఎదురుచూడాల్సిందే. ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో ముకేష్ గౌడ, రక్ష గౌడ, సాయి కిరణ్, జ్యోతి రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాపుగంటి రాజేంద్ర ఈ సీరియల్‌ను డైరెక్ట్ చేస్తున్నారు.