Sushant Singh Rajput : సుశాంత్ సింగ్ కేసులో పురోగతి.. బలమైన సాక్ష్యాలు ఉన్నాయని.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు!
సుశాంత్ సింగ్ కేసులో సిబిఐకి బలమైన ఆధారాలు దొరికాయి అంటూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు.
- gum 95921
- Published On : June 29, 2023 / 07:47 PM IST
Devendra Fadnavis Viral Comments on Sushant Singh Rajput case
Sushant Singh Rajput : బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. ధోని (MS Dhoni) బయోపిక్ తో దేశమంతా అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఎంతో టాలెంట్ ఉన్న ఈ హీరో 2020 జూన్ 14న ముంబైలోని తన ఇంటిలో విగతజీవిగా కనిపించడం అందర్నీ షాక్ కి గురి చేసింది. మొదటిలో సుశాంత్ మరణాన్ని ఆత్మహత్యగా పరిగణించారు పోలీసులు. కానీ కుటుంబసభ్యులతో పాటు చాలా మంది దీని పై అనుమానం వ్యక్తం చేయడంతో సుశాంత్ మరణం మిస్టరీ సిబిఐ (CBI) చేతులోకి వెళ్ళింది.
Bro Teaser : బ్రో టీజర్ వచ్చేసింది.. సినిమాలు ఎక్కువ చూస్తావేంట్రా నువ్వు!
ఈ మధ్య సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బాడీకి పోస్టుమార్టం నిర్వహించిన బృందంలోని ఓ వ్యక్తి.. అతనిది ఆత్మహత్య కాదని, ముమ్మాటికి హత్యే అని ఆరోపణలు చేశాడు. సుశాంత్ బాడీపై పలు గాయాలు ఉన్నాయని ఆ వ్యక్తి చెప్పుకు రావడం పెద్ద సంచలనం అయ్యింది. తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “సుశాంత్ సింగ్ కేసుకి సంబంధించిన కొన్ని బలమైన సాక్ష్యాలు తమ దగ్గర ఉన్నట్లు కొంతమంది పోలీసులను సంప్రదించినట్లు, వాటిని సేకరించిన పోలీస్ వాటిలోని నిజానిజాలను విశ్లేషిస్తున్నట్లు చెప్పుకొచ్చారు”.
Chandramukhi 2 : చంద్రముఖి గది తాళం తీసేది అప్పుడే.. ఈసారి పాన్ ఇండియా వైడ్!
ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. సుశాంత్ సింగ్ చనిపోయి దాదాపు మూడు ఏళ్ళు అవుతుంది. ఇప్పటికి కూడా ఆ మరణం మిస్టరీగా ఉండడంతో.. త్వరగా న్యాయం జరగాలంటూ అభిమానులు ప్రార్థిస్తున్నారు. కాగా ఇటీవల బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) సుశాంత మరణం గురించి సంచలన కామెంట్స్ చేసింది. సుశాంత్ మరణానికి రణ్‌బీర్, కరణ్ జోహార్ కారణం అంటూ పరోక్షంగా పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ బి-టౌన్ లో సంచలనం అయ్యింది.
