Devi Sri Prasad 10 Filmfare Awards in Span of 20 Years
Devi Sri Prasad: తాజాగా 67వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డు వేడుకలు ఆదివారం సాయంత్రం బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా ఘనంగా జరిగాయి. ఈ వేడుకకి సౌత్ సినీ ప్రముఖులు విచ్చేసి మెరిపించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినీ పరిశ్రమలలో 2020, 2021 మధ్య వచ్చిన సినిమాలకి ఈ అవార్డులని ప్రదానం చేశారు.
Devisri Prasad : పుష్ప 2 సినిమాపై అంచనాలు పెంచిన దేవిశ్రీ.. ఆల్రెడీ ఆ వర్క్ కంప్లీట్ అయిపోయిందట..
ఈ పురస్కారంలో టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్.. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాకు గాను “బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్” అవార్డును అందుకున్నాడు. దీంతో ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఖాతాలో 20 సంవత్సరాల్లో వ్యవధిలో 10 ఫిలింఫేర్ అవార్డులు జమచేరాయి. అలాగే తన ఈ 10వ బ్లాక్ లేడీని స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ గారికి అంకితం చేశాడు దేవి.
ఇక ఈ రాక్ స్టార్ టి-సిరీస్ సంస్థతో కలిసి ఒక ప్రైవేట్ మ్యూజికల్ ఆల్బమ్ చేయడానికి చేతులు కలిపాడు. ఇప్పటికే ఈ ఆల్బమ్ నుంచి విడుదలైన “ఓ పిల్లా” సాంగ్ ఒక ఊపు ఊపేస్తోంది. ఈ పాటకు అతనే లిరిక్స్ సమకూర్చి, గొంతు సవరించాడు. అలాగే పుష్ప-2 సినిమా పాటలు కూడా పూర్తీ చేసే పనుల్లో ఉన్నాడట ఈ డైరెక్టర్.