Devisri Prasad : పుష్ప 2 సినిమాపై అంచనాలు పెంచిన దేవిశ్రీ.. ఆల్రెడీ ఆ వర్క్ కంప్లీట్ అయిపోయిందట..

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. ''ఆల్రెడీ పుష్ప 2 సినిమా కోసం మూడు పాటలు కంపోజ్ చేశాము. ఈ సారి స్క్రిప్ట్ మరింత బాగుంటుంది. సుకుమార్ హైలెవెల్లో స్క్రిప్ట్ రాశాడు. కథ గురించి...............

Devisri Prasad : పుష్ప 2 సినిమాపై అంచనాలు పెంచిన దేవిశ్రీ.. ఆల్రెడీ ఆ వర్క్ కంప్లీట్ అయిపోయిందట..

Devisri Prasad said he already completed 3 songs for pushpa 2

Devisri Prasad :  అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో ఎలాంటి అంచనాలు లేకుండా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయి భారీ విజయం సాధించింది పుష్ప సినిమా. నార్త్ లో అయితే మరింత భారీ విజయం సాధించి భారీ కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఇక సినిమాలోని పాటలు, డైలాగ్స్, మ్యానరిజమ్స్ ఏ రేంజ్ లో వైరల్ గా మారాయో అందరికి తెలిసిందే. పుష్ప సినిమాకి పార్ట్ 2 ఉంటుందని గతంలోనే చెప్పారు. పుష్ప రిలీజ్ అయ్యాక ఈ సినిమా ఊహించనంత విజయం సాధించడంతో పుష్ప 2పై అంచనాలు పెరిగాయి.

దీంతో చాలా రోజులు గ్యాప్ తీసుకొని సుకుమార్ స్క్రిప్ట్ లో పాన్ ఇండియా కి తగ్గట్టు చాలా మార్పులు చేశాడు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. త్వరలోనే పుష్ప 2 సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టనున్నారు. తాజాగా మొదటిసారి పుష్ప 2 సినిమాపై మాట్లాడాడు దేవిశ్రీ. ఆల్రెడీ తన పాటలు, మ్యూజిక్ తో వరల్డ్ వైడ్ ఫేమస్ సాధించాడు.

Sharwanand : పెద్ద యాక్సిడెంట్ అయింది.. రెమ్యునరేషన్ తక్కువ తీసుకొని నన్ను నేను తక్కువ చేసుకోలేను..

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. ”ఆల్రెడీ పుష్ప 2 సినిమా కోసం మూడు పాటలు కంపోజ్ చేశాము. ఈ సారి స్క్రిప్ట్ మరింత బాగుంటుంది. సుకుమార్ హైలెవెల్లో స్క్రిప్ట్ రాశాడు. కథ గురించి నేనేమి చెప్పను. త్వరలోనే షూటింగ్ మొదలవుతుంది” అని తెలిపాడు. దీంతో దేవిశ్రీ ఆల్రెడీ పుష్ప 2 కోసం మూడు పాటలు కంపోజ్ చేశాడని చెప్పడంతో బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా సినిమా చూడాలని అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు.