Sharwanand : పెద్ద యాక్సిడెంట్ అయింది.. రెమ్యునరేషన్ తక్కువ తీసుకొని నన్ను నేను తక్కువ చేసుకోలేను..

శర్వానంద్ తన రెమ్యునరేషన్ గురించి మాట్లాడుతూ.. ''19 ఏళ్ల నుంచే నేను సినిమాల్లో ఉన్నాను. అప్పట్నుంచే సంపాదించడం మొదలుపెట్టాను. అప్పుడే డిసైడ్ అయ్యాను పేరెంట్స్ నుంచి డబ్బులు తీసుకోకూడదు అని. నా మొదటి ప్రాధాన్యత...............

Sharwanand : పెద్ద యాక్సిడెంట్ అయింది.. రెమ్యునరేషన్ తక్కువ తీసుకొని నన్ను నేను తక్కువ చేసుకోలేను..

Sharwanand gives clarity about his remunaration

Sharwanand :  కొత్త కొత్త కథలతో ప్రేక్షకులని పలకరిస్తూ హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు శర్వానంద్. త్వరలో ఒకేఒక జీవితం అంటూ తెలుగు, తమిళ్ బైలింగ్వల్ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలని తెలిపాడు.

శర్వానంద్ మాట్లాడుతూ.. ”జాను టైంలో నాకు పెద్ద ప్ర‌మాదం జ‌రిగింది. దాని నుంచి కోలుకునే క్రమంలో యాంటీ బ‌యోటిక్స్, స్టెరాయిడ్స్ తీసుకున్నాను. దాంతో బాగా బరువు పెరిగాను. ఇక కరోనా గ్యాప్స్ లో 4 సినిమాలు చేశాను. దాంతో నాకు వ‌ర్క‌వుట్‌కు స‌మ‌యం దొరకలేదు. కొన్ని రోజులు షూటింగ్స్ కి బ్రేక్ తీసుకొని 6 నెలలు వ‌ర్కవుట్స్ చేశాను” అని తెలిపారు.

Mrunal Thakur : ఆ సినిమా చూపించాకే నన్ను సినిమాల్లోకి పంపించారు.. లేకపోతే డెంటిస్ట్ అయ్యేదాన్ని..

శర్వానంద్ తన రెమ్యునరేషన్ గురించి మాట్లాడుతూ.. ”19 ఏళ్ల నుంచే నేను సినిమాల్లో ఉన్నాను. అప్పట్నుంచే సంపాదించడం మొదలుపెట్టాను. అప్పుడే డిసైడ్ అయ్యాను పేరెంట్స్ నుంచి డబ్బులు తీసుకోకూడదు అని. నా మొదటి ప్రాధాన్యత డబ్బులు కాదు కానీ త‌క్కువ రెమ్యునరేష‌న్ తీసుకుని న‌న్ను నేను త‌క్కువ చేసుకోలేను. డబ్బుల విషయంలో ఎవ‌రైనా నన్ను మోసం చేస్తే భ‌రించ‌లేను. గతంలో ఓ నిర్మాత‌తో నాకు ఛేదు అనుభ‌వం ఉంది” అంటూ తెలిపాడు.