Devi Sri Prasad about Poonakaalu Loading song
Devi Sri Prasad : చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఇక ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుండి చిరంజీవి మాస్ మూలవిరాట్‌గా పూనకాలు తెప్పించబోతున్నాడు అంటూ చెప్పుకొస్తున్నారు మూవీ మేకర్స్. ఆ రేంజ్ లోనే ఉన్నాయి మూవీ సాంగ్స్, టీజర్స్ అండ్ చిరు గెటప్. దీంతో ప్రేక్షకులకు మరెంత పూనకాలు తెప్పించేందుకు దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ‘పూనకాలు లోడింగ్’ సాంగ్ ఆడియన్స్‌ని ఒక ఊపు ఊపేస్తోంది.
Waltair Veerayya: సెన్సార్ పనులు ముగించుకున్న ‘వాల్తేరు వీరయ్య’
ముక్యంగా ర్యాప్ సింగర్ రోల్ రైడా రాసిన లిరిక్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఈ లిరిక్స్ గురించి దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. “ఈ సాంగ్ లిరిక్స్ చాలా విచిత్రంగా ఉండాలని ‘ఏ లిరిక్ బిరిక్ పక్కన బెట్’ అని ఒక లైన్ అనుకున్నా. ఆ ఐడియాని చిరంజీవి గారితో పాటు అందరికి వినిపించా, అందరికి చాలా బాగా నచ్చింది. ఇక ఈ సాంగ్ కి లిరిక్స్ రాయడానికి రోల్ రైడాని పిలిచి.. లిరిక్స్ పిచ్చిపిచ్చిగా ఉండాలి. ఏమి రాస్తావో నాకు తెలియదు, ట్యూన్ ఇది అంటూ అతనికి ఇచ్చా. రోల్ రైడా కూడా అలానే రాసుకొచ్చాడు. ఇక ఆ పాటని కూడా అలానే పిచ్చిపిచ్చిగా పాడాము” అంటూ తెలియజేశాడు.
అలాగే ఈ సాంగ్‌కి ఇన్‌స్ట్రుమెంట్‌గా పిల్లలు ఆడుకొనే ఒక బూరని ఉపయోగించినట్లుగా తెలియజేశాడు. ప్రస్తుతం ఈ పాట అందర్నీ ఊర్రూతలూగిస్తుంది. కాగా ఈ సినిమాని దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా రవితేజ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.