Devil Movie Director Name Issue Director Naveen Medaram gives Clarity
Devil Movie : సినీ పరిశ్రమలో దర్శకులు, రచయితలు కష్టపడి రాసిన, తీసిన సినిమాలకు కొన్ని సార్లు ఎవరెవరో పేర్లు వేసుకుంటారని టాక్ వస్తుంది. నేనింతే(Neninthe) సినిమాలో రవితేజ(Raviteja) డైరెక్టర్ గా సినిమా తీస్తే డబ్బులు పెట్టిన విలన్ రవితేజ పేరు తీసేసి అతని పేరు వేసుకుంటాడు. ఇలాంటి సంఘటనే ఇటీవల నిజంగానే తెలుగు ఇండస్ట్రీలో జరిగింది.
నవీన్ మేడారం(Naveen Medaram) దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) హీరోగా తెరకెక్కిన సినిమా డెవిల్(Devil). స్వాతంత్య్రం కంటే ముందు జరిగిన సంఘటనలపై, బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ కథతో ఈ సినిమా ఉండబోతుంది. డిసెంబర్ 29న ఈ సినిమా రిలీజ్ ఉండటంతో ప్రస్తుతం చిత్రయూనిట్ డెవిల్ సినిమా ప్రమోషన్స్ లో ఉన్నారు. డెవిల్ సినిమాని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం ఈ సినిమా డైరెక్టర్ ని ప్రాజెక్టులోంచి పక్కకు తప్పించి నిర్మాత అభిషేక్ నామానే డైరెక్టర్ గా పేరు వేసుకోవడంతో టాలీవుడ్ లో చర్చగా మారింది.
సినిమా మొత్తం పూర్తయ్యాక అప్పటివరకు ఉన్న పోస్టర్స్ లో నవీన్ మేడారం పేరు ఉంటే ఆ తర్వాత నుంచి దర్శకుడు, నిర్మాత రెండు పేర్లు అభిషేక్ నామానే వేసుకున్నాడు. అయితే దీనిపై నవీన్ ఎక్కువ రచ్చ చేయలేదు. తన ట్విట్టర్ లో సింపుల్ గా ఓ ట్వీట్ పెట్టి వదిలేశాడు. తాజాగా సినిమా రిలీజ్ సమయంలో దీనిపై నవీన్ మేడారం ఓ పోస్ట్ చేశాడు.
నవీన్ మేడారం తన ట్విట్టర్లో తనను డైరెక్టర్ గా తీసేయడంపై స్పందిస్తూ.. డెవిల్ సినిమా కోసం నా మూడేళ్లు డెడికేట్ చేశాను. సినిమాకి దగ్గరుండి లొకేషన్స్, కాస్ట్యూమ్స్, స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే.. అన్ని దగ్గరుండి చూసుకున్నాను. 105 రోజులు డిఫరెంట్ లొకేషన్స్ లో ఈ సినిమాని షూట్ చేశాను కొన్ని ప్యాచ్ వర్క్స్ తప్ప. డెవిల్ సినిమా పూర్తిగా నా క్రియేషన్. అది కేవలం ఒక ప్రాజెక్టు మాత్రమే కాదు నా బేబీ. ఎవరు ఏమనుకున్నా డెవిల్ నా సినిమా. కొంతమంది చేసిన తప్పులకు నేను ఈ ఇష్యూ మీద మొదటి నుంచి సైలెంట్ గానే ఉన్నాను. నేను దీని మీద క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. సినిమా తీసేటప్పుడు నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఇవాళ జరుగుతున్న ఇష్యూ కేవలం కొంతమంది ఇగో వల్లే వచ్చింది. నేను ఎలాంటి లీగల్ యాక్షన్ ఎవరి పైనా తీసుకోవట్లేదు. నా సొంత సినిమాకి నా డైరెక్షన్ పేరు తీసేసి క్రెడిట్ తీసుకున్నందుకు చాలా బాధపడ్డాను. అయినా నేను నా కెరీర్ మీద మళ్ళీ ఫోకస్ చేస్తాను. ఇంతకంటే స్ట్రాంగ్ గా తిరిగొస్తాను అని చెప్పారు.
అలాగే.. ఈ సినిమాకి కళ్యాణ్ రామ్ సర్ 100 శాతం ఎఫర్ట్ పెట్టి పనిచేశారు. ఈ సినిమాకు ఎంతగానో సపోర్ట్ చేసిన వారందరికీ నా కృతజ్ఞతలు. డెవిల్ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అందరూ థియేటర్స్ కి వచ్చి డెవిల్ సినిమాని చూడాలని కోరుకుంటున్నాను. నేను ఒక కొత్త సినిమాకి సైన్ చేశాను. దాని మీద వర్క్ చేస్తున్నాను. త్వరలో ఆ సినిమా వివరాలు ప్రకటిస్తానని తెలిపాడు నవీన్ మేడారం.
దీంతో పలువురు నెటిజన్లు నవీన్ మేడారంని అభినందిస్తూనే పేరు తీసేసి నిర్మాత డైరెక్టర్ గా కూడా తన పేరే వేసుకున్నందుకు విమర్శలు కూడా చేస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు అభిషేక్ నామా స్పందించలేదు. సినిమా ప్రమోషన్స్ లో కూడా ఈ ఇష్యూ గురించి ఎవ్వరూ మాట్లాడకపోవడం గమనార్హం.
— Naveen Medaram (@NaveenMedaram) December 27, 2023