Dhamaka 1st Day Collections : మొదటి రోజు ఫర్వాలేదనిపించింది మాస్ మహారాజ.. ధమాకా ఫస్ట్ డే కలెక్షన్స్..

మొదటి రోజు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ధమాకా సినిమా. రవితేజ కామెడీ, మాస్ పర్ఫార్మెన్స్ తో మంచి మాస్ ఎంటర్టైనర్ లా ఉందని అంటున్నారు. దీంతో సినిమాకి మరింత ప్రమోషన్ అవడంతో రెండో రోజు బుకింగ్స్ మరిన్ని పెరిగాయి. అయితే ధమాకా సినిమా ప్రపంచవ్యాప్తంగా...........

Dhamaka 1st Day Collections

Dhamaka 1st Day Collections : రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ధమాకా. రవితేజ చాలా రోజుల తర్వాత డ్యూయల్ రోల్ చేసిన ఈ సినిమా డిసెంబర్ 23న రిలీజ్ అయింది. రవితేజ గత రెండు సినిమాలు నిరాశపరచడంతో ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకొని రవితేజ మొదటిసారి ముందుండి ప్రమోషన్స్ చేశాడు.

మొదటి రోజు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ధమాకా సినిమా. రవితేజ కామెడీ, మాస్ పర్ఫార్మెన్స్ తో మంచి మాస్ ఎంటర్టైనర్ లా ఉందని అంటున్నారు. దీంతో సినిమాకి మరింత ప్రమోషన్ అవడంతో రెండో రోజు బుకింగ్స్ మరిన్ని పెరిగాయి. అయితే ధమాకా సినిమా ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా క్లీన్ హిట్ అయి బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 19 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టాలి.

Pawan Kalyan : వీరసింహారెడ్డి‌తో భీమ్లా నాయక్ భేటీ..

ధమాకా సినిమా మొదటి రోజు 10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అంటే దాదాపు 6 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ వచ్చినట్టే. అయితే మొదటి రోజు భారీగా రాకపోయినా ఫర్వాలేదనిపించాడు రవితేజ. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 13 కోట్ల షేర్ కలెక్షన్స్ రావాలి. ఇదే ఊపు కొనసాగి, వీకెండ్ కూడా ఉండటంతో మరో నాలుగు రోజుల్లోనే ధమాకా సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందని భావిస్తున్నారు చిత్ర యూనిట్.