Dhamaka break even complete
Dhamaka : మాస్ మహారాజ్ రవితేజ తాజా చిత్రం ‘ధమాకా’. రవితేజ డ్యూయల్ రోల్ చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపుతుంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ.. మాస్ అండ్ హిలేరియస్ కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో ఒక్కప్పటి రవితేజ మార్క్ కామెడీని దర్శకుడు చూపించడంతో ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు.
రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపించి డబుల్ ధమాకా ఇవ్వడంతో.. మొదటిరోజు దాదాపు రూ.10 కోట్లు కొల్లగొట్టి రవితేజ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్‌గా నిలిచింది. ఇక ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.41 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక షేర్ రూ.21 కోట్లు వచ్చేయడంతో ధమాకా నాలుగు రోజులోనే బ్రేక్ ఈవెన్ సాధించి డబుల్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది.
రవితేజ మునపటి సినిమాలు ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో, ఈ సినిమా కోసం చాలా కష్ట పడ్డాడు. తానే డైరెక్ట్ గా ప్రమోషన్స్ చేసుకుంటూ వచ్చాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ‘శ్రీలీల’ యాక్టింగ్ అండ్ ఎనర్జీ లెవెల్స్ కి ఆడియన్స్ నుంచి మంచి మార్కులే పడుతున్నాయి. అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు.
Our #Dhamaka
MASSive 4️⃣ Days
Unstoppable Rampage ?@RaviTeja_offl @peoplemediafcy @TrinadharaoNak1 @sreeleela14 @KumarBezwada @srinu10477 @sujithkolli @UrsVamsiShekar @vivekkuchibotla #DhamakaBlockBuster pic.twitter.com/SoZOhj7xzT— Chirag jani (@JaniChiragjani) December 27, 2022