Dhanaraj Shares Interesting Thing about Allu Arjun Happened at Parugu Movie Time
Allu Arjun – Dhanaraj : తాజాగా ధనరాజ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ గురించి ఆసక్తికర విషయం తెలిపాడు. అల్లు అర్జున్ తో ధనరాజ్ పరుగు సినిమాలో కలిసి నటించాడు. ఆ సినిమాలో వీళ్లిద్దరి కాంబినేషన్లో చాలానే సీన్స్ ఉన్నాయి. దీంతో వీరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది.
ధనరాజ్ పరుగు సినిమా సమయంలో జరిగిన ఓ సంఘటనను పంచుకుంటూ.. పరుగు సమయంలో అల్లు అర్జున్ గారితో మార్చ్ 5న మా పెళ్లి రోజు సర్.. మీరు మా వైఫ్ కోసం సర్ ప్రైజ్ కాల్ చేయాలి, విషెష్ చెప్పాలి అని అడిగాను. అలా డైరెక్ట్ గా అడగకూడదు అని కూడా అప్పుడు నాకు తెలీదు. మా పెళ్లి రోజు బెడ్ రూమ్ లో నేను, మా ఆవిడ ఏదో బట్టలు మడతబెడుతుంటే ఫోన్ వచ్చింది. లిఫ్ట్ చేస్తే నేను బన్నీ అన్నారు. ఏ బన్నీ అని అడిగాను. నేనయ్య బన్నీని మీ ఆవిడకు విషెష్ చెప్పాలి, కాల్ చేయమన్నవ్ గా అని అనగానే నేను షాక్. వెంటనే సర్ సర్ అంటూ లౌడ్ స్పీకర్ లో పెట్టి మా ఆవిడకు ఇస్తే హ్యాపీ యానివర్సరీ, గాడ్ బ్లెస్ యు అంటూ విషెష్ చెప్పారు. అసలు అప్పటికే ఆయన పెద్ద హీరో. అలాంటిది నేను అడగడమే తప్పు అనుకుంటే ఆయన గుర్తుంచుకొని మరీ కాల్ చేస్తారని అనుకోలేదు. ఆలా చేయగానే చాలా ఆశ్చర్యపోయాను అని అన్నారు.
Also Read : Buchi Babu Sana : మా నాన్న చనిపోయారు.. ఉప్పెనకు అలా అడిగారు.. రామ్ చరణ్ సినిమాకు అలా అడగాల్సిన అవసరం లేదు..
దీంతో ధనరాజ్ వ్యాఖ్యలు వైరల్ అవ్వగా బన్నీ ఫ్యాన్స్.. అది బన్నీ అంటే గుర్తుంచుకొని మరీ ఒక చిన్న ఆర్టిస్ట్ పెళ్లి రాజుకు ఫోన్ చేసి విషెష్ చెప్పడం అంటే మాటలు కాదు అని అభినందిస్తున్నారు. జబర్దస్త్, సినిమాలతో కమెడియన్ గా ఫేమ్ తెచ్చుకున్న ధనరాజ్ ఇప్పుడు దర్శకుడిగా మారి రామం రాఘవం సినిమాతో ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.