Samantha : ఆర్థిక కష్టాల్లో సమంత సిరీస్.. చేతిలో ఉన్న ఒక్క సిరీస్ కూడా ఆగినట్టేనా..? ఫైర్ అవుతున్న నెట్ ఫ్లిక్స్..
తనకు ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఇచ్చి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాజ్ & డీకే లు తెరక్కేక్కిస్తున్న మరో సిరీస్ కి ఓకే చెప్పింది సమంత.

Samantha Netflix Series Rakt Brahmand Stopped Due To Financial Issues
Samantha : సమంత తన హెల్త్ కోసం కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సినిమాలకు గ్యాప్ ఇచ్చినా యూట్యూబ్ లో హెల్త్ వీడియోలు, తన బిజినెస్ లతో బిజీగానే ఉంది. సమంత చివరగా ఖుషి సినిమాతో కనపడింది. ఇటీవల తాను అప్పుడెప్పుడో చేసిన సిటాడెల్ సిరీస్ రిలీజయింది.
ప్రస్తుతం సమంత చేతిలో మా ఇంటి బంగారం అనే ఒక సినిమా ఉంది. ఇది కూడా సమంత సొంత నిర్మాణ సంస్థలోదే. ఇంకే సినిమాలు సమంత ఒప్పుకోలేదు. అయితే తనకు ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఇచ్చి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాజ్ & డీకే లు తెరక్కేక్కిస్తున్న మరో సిరీస్ కి ఓకే చెప్పింది. నెట్ ఫ్లిక్స్, డి2ఆర్ సంయుక్త నిర్మాణంలో ఆదిత్య రాయ్ కపూర్, సమంత జంటగా భారీ బడ్జెట్ తో హారర్ ఫాంటసీ వెబ్ సిరీస్ ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్’ ని ప్రకటించారు.
Also Read : Buchi Babu Sana : మా నాన్న చనిపోయారు.. ఉప్పెనకు అలా అడిగారు.. రామ్ చరణ్ సినిమాకు అలా అడగాల్సిన అవసరం లేదు..
ఈ సిరీస్ షూటింగ్ 25 రోజులు జరిగింది. అయితే ప్రస్తుతం ఈ సిరీస్ షూటింగ్ ఆగిపోయిందని బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. నెట్ ఫ్లిక్స్ ఈ సిరీస్ కు భారీగా బడ్జెట్ కేటాయించినా 25 రోజులు షూటింగ్ కే సగం బడ్జెట్ అవగొట్టారట. ఇంకా చాలా రోజులు షూట్ బ్యాలెన్స్ ఉంది. ఈ సిరీస్ కి పనిచేస్తున్న ఓ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా బడ్జెట్ విషయంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడి కొన్ని కోట్ల రూపాయలు దొంగలించాడని బాలీవుడ్ టాక్.
అలాగే ఈ సిరీస్ డైరెక్టర్ రాహి అనిల్ బార్వే, రైటర్ సీతా ఆర్ మేనన్ మాటిమాటికి స్క్రీన్ ప్లే కూడా మారుస్తుండటంతో ఖర్చు పెరుగుతుంది అని తెలుస్తుంది. దీంతో ఈ విషయంపై నెట్ ఫ్లిక్స్ సిరీస్ యూనిట్ పై ఫైర్ అయిందని సమాచారం. భారీ బడ్జెట్ సిరీస్ ఇస్తే ఇలా చేస్తారా అంటూ రాజ్ & డీకే నిర్మాణ సంస్థను ప్రశ్నించింది. దీంతో నిర్మాణ సంస్థతో పాటు నెట్ ఫ్లిక్స్ కూడా అసలు ఏం జరుగుతుంది అని విచారణ చేపట్టారు. దీంతో ప్రస్తుతానికి ఈ సిరీస్ షూటింగ్ ఆగిపోయింది.
Also Read : Sukumar – Ram Charan : సుకుమార్ సినిమాలో చరణ్ అలా కనిపిస్తాడా? RC17 సినిమా వర్క్ మొదలుపెట్టిన సుక్కు..?
ప్రస్తుతం సమంత చేతిలో సినిమాలేవీ లేవు. ఉన్న ఒక్క సినిమా తన నిర్మాణ సంస్థలోదే. ఇక ఉన్న ఈ ఒక్క సిరీస్ కూడా ఆగిపోయింది అని ఫ్యాన్స్ బాధపడుతున్నారు. ఈ నిర్మాణ సంస్థ అధినేతల్లో ఒకరైన నిర్మాత, దర్శకుడు రాజ్ తో సమంత ప్రేమలో ఉన్నట్టు, డేటింగ్ చేస్తున్నట్టు ఇటీవల రెగ్యులర్ గా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి చెన్నై పికెల్ బాల్ టీమ్ కూడా కొనుగోలు చేసారు.