#SIR – Pre Release Event Live Updates : ధనుష్ సార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ అప్డేట్స్..

ధనుష్ సార్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో నేడు ఫిబ్రవరి 15 సాయంత్రం 6 గంటల నుండి నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కి ధనుష్ తో పాటు చిత్రయూనిట్ అంతా హాజరవనున్నారు.

#SIR – Pre Release Event Live Updates : ధనుష్ సార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ అప్డేట్స్..

Dhanush and Samyuktha menon #SIR movie Pre Release Event Live Updates from necklace road

Updated On : February 15, 2023 / 10:49 PM IST

#SIR – Pre Release Event Live Updates :  ధనుష్, సంయుక్త మీనన్ జంటగా డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో శ్రీకర స్టూడియోస్ సహా నిర్మాణంలో తెరకెక్కుతున్న బైలింగ్వల్ సినిమా సార్. తమిళ్ లో వాతిగా రానుంది. ఫిబ్రవరి 17న శివరాత్రి కానుకగా ఈ సినిమా తమిళ్, తెలుగు భాషలతో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచారు. ట్రైలర్ లాంచ్, ఆడియో లాంచ్, ప్రెస్ మీట్ లు నిర్వహించగా తాజాగా సార్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ధనుష్ సార్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో నేడు ఫిబ్రవరి 15 సాయంత్రం 6 గంటల నుండి నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కి ధనుష్ తో పాటు చిత్రయూనిట్ అంతా హాజరవనున్నారు.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 15 Feb 2023 10:43 PM (IST)

    ధనుష్

    ధనుష్ తమిళ్ వచ్చు, తెలుగు కొంచెం కొంచెమో వచ్చు అని చెప్పడంతో త్రివిక్రమ్ డబ్బింగ్ చెప్తా అన్నారు. ధనుష్ మాట్లాడుతుంటే మధ్య మధ్యలో త్రివిక్రమ్ తెలుగు హెల్ప్ చేశారు. 2002లో మొదటి సినిమా చాలా నెర్వస్ గా ఉన్నాను తమిళ్ లో రిలీజ్ అయినప్పుడు. 2023లో తెలుగు మొదటి సినిమా రిలీజ్ అవుతుంది ఇప్పుడు కూడా నెర్వస్ గా ఉంది. నా మొదటి సినిమాలాగా ఫీల్ అవుతాను. ఇక్కడ ఉన్న అందరు అన్ని లాంగ్వేజెస్ మాట్లాడుతున్నారు. నాకు ఒక్కడికే ఒక్క తమిళ్ వచ్చింది. సముద్రఖని గారికి రాదు అనుకున్నాను, ఆయన కూడా తెలుగు మాట్లాడారు. చాలా సింపుల్ సినిమా ఇది. సింపుల్ స్టోరీ, గ్రాండ్ మెసేజ్. ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. వంశీ, వెంకీ చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు, నాకు ఇంకా భయం వేస్తుంది. ఇది మీ అందరి కథ. డైరెక్టర్ కి థ్యాంక్స్ చెప్పాలి మంచి కథ తీసుకొచ్చినందుకు. త్రివిక్రమ్ గారు నాకు చాలా మంచి వెల్కమ్ ఇచ్చారు. డైలీ సాయి కుమార్ గారి ఇంటి నుంచి లంచ్ తెచ్చారు. మీ భార్యకు కూడా థ్యాంక్స్ చెప్పండి. హైపర్ ఆది క్రేజ్ చూసి షాక్ అయ్యాను. అతని పేరు చెప్పగానే విజిల్స్, అరుపులు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ జబర్దస్త్ వాళ్ళ ఫేమస్ అయ్యాడు అని చెప్తే ధనుష్ యూట్యూబ్ లో చూస్తాను అని చెప్పారు. తమన్ నా ఫ్యామిలీ మెంబర్ లాంటి వాడు. అఖండలో మీ వర్క్ బాగా నచ్చింది. GV దీనికి మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమా అందరికి నచ్చుతుంది. నెక్స్ట్ తెలుగు సినిమా వరకు తెలుగు నేర్చుకొని తెలుగు స్పీచ్ ఇస్తాను. సుమ గారు సూపర్. అని చెప్పారు. అలాగే మాస్టారు మాస్టారు సాంగ్ పాడి అందర్నీ అలరించారు ధనుష్.

    Sir Pre Release Event

     

  • 15 Feb 2023 10:34 PM (IST)

    త్రివిక్రమ్

     

    త్రివిక్రమ్ మాట్లాడుతూ.. కబీర్ చెప్పిన ఒక పద్యం చెప్పారు గురువులకు సంబంధించినది. కరోనా టైములో జూమ్ కాల్ లో నాకు కథ చెప్పాడు. మా ఆవిడ కూడా ఈ సినిమాకి నిర్మాత. సినిమా చూసింది ఆల్రెడీ, బాగా వచ్చింది అని చెప్పింది. ఈ సినిమా నాకు కూడా చాలా నచ్చింది. విద్య, వైద్యం అనే మౌలిక సదుపాయాలు డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు అని తేడా లేకుండా అందరికి అందచేయాలి. కనై ఏవ్ దూరం అవుతున్నాయి. మనిషిని చదువు మారుస్తుంది. ఎవరినైనా గొప్పగా మారుస్తుంది చదువు. డబ్బు లేకపోతే చదువు దూరం చేస్తారా అనే ప్రశ్నే ఈ సినిమా. ఇప్పుడు చదువు lkg, ukg లోనే బాగా ఖరీదు అయిపోతుంది. వెంకీ బాగా కష్టపడ్డాడు. డబ్బులు లేక ఇంజనీరింగ్ చేయలేక డిగ్రీ చదువుకున్నా. ఈ సినిమాలో ఒక డైలాగ్ అమ్మ నాన్నల గురించి రాసాడు. మా నాన్న గుర్తొచ్చారు. ఆ డైలాగ్ విన్నాక. జల్సాలో ఇలాంటి డైలాగ్ రాశాను ఒకటి. పీరియాడిక్ ఫిలిం గా తీశారు కానీ ఆ కథ ఇప్పటికి సరిపోతుంది. గురువుల గురించి చాలా బాగా చెప్పారు. నేను లెక్చరర్ గా చేశాను. ధనుష్ రఘువరన్ BTech సినిమా చాలా మందిని మోటివేట్ చేసింది. ఇప్పటికి చేస్తుంది. సార్ సినిమా కూడా అలాగే చాలా రోజులు మనకి వినిపిస్తుంది. ధనుష్ గొప్ప నటుడు. సినిమా విజయం, అపజయం మీద భయం లేదు ధనుష్ కి. పని చేసుకుంటూ వెళ్తాడు. ధనుష్ ని ఎవ్వరూ ఆపలేడు. తెలుగు వాళ్ళు సినిమా బాగుంటే ఎవర్నైనా ఆదరిస్తారు. ఇప్పుడు లాంగ్వేజ్ బారియర్ లేదు. ధనుష్ అందరివాడు. ధనుష్ ని తెలుగులో నేను నిర్మాతగా పరిచయం చేస్తున్నందుకు గర్విస్తున్నాను. తెలుగులో మొదటి అడుగు గర్వంగా వేస్తున్నారు. డైరెక్టర్ చాలా మంచి సినిమా చేశాడు. సక్సెస్ కొట్టాడు. తమన్ నాకు బ్రదర్ లాంటి వాడు. సాయి కుమార్ ఉండరు రేటెడ్ యాక్టర్. ఆదితో చాలా విషయాలు పర్సనల్ గా మాట్లాడాలి. ఆది ప్రేమకి నేను ఆనందిస్తున్నాను. మా ఆవిడ కూడా హిట్ కొట్టింది ఈ సినిమా. ధనుష్ కి తెలుగులో గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నాం. సినిమా అందరికి నచ్చుతుంది. నిర్మాత చినబాబు గారు నెగిటివ్ కామెంట్స్ చెప్పకపోతే సినిమా హిట్ అయినట్టే. ఈ సినిమాకి ఒక్క నెగిటివ్ కూడా చెప్పలేదు. అందుకే అందరం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. సుమ సాయంత్రం డైలీ స్టేజి మీదే ఉంటారు. డైలీ వాళ్ళింట్లో రాజీవ్ గారే వంట చేస్తారు. వంట విషయంలో నన్ను మా ఆవిడ తిట్టింది. మళ్ళీ వంట రూమ్ లోకి రావొద్దు అని చెప్పింది అని అన్నారు.

     

    Sir Pre Release Event

     

  • 15 Feb 2023 10:13 PM (IST)

    తమన్

    తమన్ డబ్బులిచ్చి మొదటి టికెట్ ని నిర్మాత నాగవంశీ దగ్గర్నుంచి కొన్నారు.

    Sir Pre Release Event

     

  • 15 Feb 2023 10:07 PM (IST)

    సంయుక్త మీనన్

     

    సంయుక్త మీనన్ మాట్లాడుతూ.. నాకు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చారు. సినిమా ప్రివ్యూ చూసిన వాళ్లంతా బాగుంది అని చెప్తున్నారు. నాకు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. అందరికి థ్యాంక్స్ చెప్పింది. ధనుష్ గురించి తమిళ్ లో మాట్లాడింది.

  • 15 Feb 2023 10:02 PM (IST)

    నాగవంశీ

    నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. సినిమా మీద మాకు చాలా కాన్ఫిడెంట్ ఉంది. అందుకే ప్రీమియర్స్ కూడా ఒక రోజు ముందే వేశాం. అన్ని ఫిల్ అయ్యాయి. అంచనాలు చాలా ఉన్నాయి. అన్ని అంచనాలు అందుకున్నాయి.

    Sir Pre Release Event

     

  • 15 Feb 2023 10:01 PM (IST)

    డైరెక్టర్ వెంకీ అట్లూరి

     

    చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. మౌత్ టాక్ తో సినిమా ఇంకా పెద్ద హిట్ అవుతుంది. కనీసం నెల రోజులు ఈ సినిమా ఆడుతుంది అని చెప్పారు. ఆ తర్వాత తన లైఫ్ లో సపోర్ట్ చేసిన గురువులందరికి థ్యాంక్స్ చెప్పారు. త్రివిక్రమ్ గారిని చూసి రైటర్ అయ్యాను. ఇప్పుడు నా సినిమాకి ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఇంతకంటే ఏం కావాలి. చాలా మంచి పాటలు ఇచ్చారు. సినిమా ఎడిట్ టేబుల్ మీదే ప్రాణం పోసుకుంటుంది. ఎడిటర్ నవీన్ నూలి ఈ సినిమాని చాలా బాగా కట్ చేశాడు. ధనుష్ గారు ఈ సినిమా ఇచ్చినందుకు ఎన్ని సార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. సినిమాలోని నాదస్వరం అనే ఓ సంగీత పరికరం గురించి, దాని గురించి ధనుష్ చెప్పిన కథని చెప్పారు. ధనుష్ సార్ కెమెరా ముందు ఉంటే ఎవరూ కనపడరు. GV మ్యూజిక్ బాగా ఇచ్చాడు. సక్సెస్ మీట్ లో మాట్లాడతాను మళ్ళీ.

    Sir Pre Release Event

     

  • 15 Feb 2023 09:48 PM (IST)

    తమన్

     

    హైపర్ ఆది బాగా మాట్లాడాడు. మ్యూజిక్ డైరెక్టర్ GV రాలేకపోయాడు, అతని కోసం నేను వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. సినిమాకి కర్చీఫ్ తీసుకెళ్లండి, ఏడుస్తూ వస్తారు థియేటర్లోంచి. సితార ఎంటర్టైన్మెంట్స్ మంచి మంచి సినిమాలు తీస్తుంది. డైరెక్టర్ వెంకీని ఈ సినిమా రిలిజ్ అయ్యాక అందరూ సార్ అనే పిలుస్తారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. త్రివిక్రమ్ సార్ నాకు ఈ స్టేజ్ ఇచ్చారు. నా లైఫ్, క్యారెక్టర్ అంతా త్రివిక్రమ్ సార్ మార్చారు. నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు.

    Sir Pre Release Event

     

  • 15 Feb 2023 09:43 PM (IST)

    సముద్ర ఖని

     

    లక్షమంది ట్రై చేస్తే ఒక్కరికి ఛాన్స్ వస్తుంది సినిమా తీయడానికి. అలా వచ్చినప్పుడు ఇలాంటి మంచి సినిమా తీసిన డైరెక్టర్ వెంకీ గ్రేట్. ధనుష్ గారు నాకు సెకండ్ లైఫ్ ఇచ్చారు. సితారలో నాకు ప్రతి సినిమాలోనూ ఒక క్యారెక్టర్ ఇస్తున్నారు. త్రివిక్రమ్ గారి పేరు నాకు ఒక మంత్రం లాంటిది. త్రివిక్రమ్ అన్న ఉంటే చాలా పాజిటివ్ ఉంది.

    Sir Pre Release Event

     

  • 15 Feb 2023 09:39 PM (IST)

    హైపర్ ఆది

     

    ఒక మంచి అరిటాకు వేసి ఫుల్ మీల్స్ పెట్టి చాలా బాగుండే భోజనం లాగే ఉంటుంది ఈ సినిమా. చాలా బాగుంటుంది ఈ సినిమా. ఇందులో స్టార్ యాక్టర్స్ తో వర్క్ చేయడం నా అదృష్టం. ధనుష్ గారి సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ వెంకీకి చాలా థ్యాంక్స్. నా ఇన్‌స్పిరేషన్ త్రివిక్రమ్ గారు సినిమాలతోనే కాదు స్పీచ్ లతో కూడా అయన అందర్నీ మెప్పిస్తారు. త్రివిక్రమ్ గారిని బాగా పొగిడాడు ఆది. పవన్ కళ్యాణ్ గారిని కూడా గుర్తు చేసి పవన్ ని, త్రివిక్రమ్ గారిని కలిపి పొగిడాడు ఆది.

    Sir Pre Release Event

     

  • 15 Feb 2023 09:30 PM (IST)

    శ్వేతా మోహన్

     

    సార్ సినిమాలో సూపర్ హిట్ అయిన మాస్టారు మాస్టారు సాంగ్ ని పాడిన శ్వేతా మోహన్ మాట్లాడుతూ.. ఈ పాటని మీ సొంత సాంగ్ చేసుకున్నారు. తెలుగులో నేను చాలా హిట్ సాంగ్స్ పాడాను కానీ ఈ పాటని చాలా స్పెషల్ చేశారు. ధనుష్ గారు నన్ను ఈ పాటకి సజెస్ట్ చేశారు. తెలుగులో ఫస్ట్ టైం లైవ్ గా పాడుతున్నాను అని తెలిపారు. అలాగే పాటని లైవ్ లో పాడి అందర్నీ ఎంటర్టైన్ చేశారు.

    Sir Pre Release Event

     

  • 15 Feb 2023 09:25 PM (IST)

    అనురాగ్ కులకర్ణి

    సుద్దాల అశోక్ తేజ్ గారు రాశారు ఈ పాటని. ఈ సినిమాలో ఇంకో పాట కూడా పాడాను. ఈ సినిమాలో పాటలు పాడటం నా అదృష్టం. అని చెప్పి సంధ్యని ఉదయిద్దాం.. అనే ఈ సినిమాలోని మరో పాటను కూడా కొన్ని లైన్స్ పాడి వినిపించాడు.

  • 15 Feb 2023 09:21 PM (IST)

    అనురాగ్ కులకర్ణి

    అనురాగ్ కులకర్ణి సార్ సినిమాలోని బంజారా బంజారా అనే అద్భుతమైన పాట పాడి అదిరిపోయే ప్రదర్శన ఇచ్చాడు.

    Sir Pre Release Event

    \

  • 15 Feb 2023 09:15 PM (IST)

    సాయి కుమార్

     

    యాక్టర్ గా ఇది నా 50వ సంవత్సరం. గురువుకి ఈ సార్ సినిమా పట్టాభిషేకం చేస్తుంది. ఇందులో చాలా మంచి క్యారెక్టర్ చేశాను. నేను శివాజీ గణేశన్ గారికి పెద్ద ఫ్యాన్. ధనుష్ IPL మ్యాచెస్ బాగా చూస్తాడు. మధ్యలో స్కోర్ అడుగుతుంటారు. సముద్రఖనితో కలిసి చేయడం ఇదే మొదటి సినిమా. మళ్ళీ మళ్ళీ కలిసి చేస్తున్నాము. చదువుకు సంబంధించిన అద్భుతమైన కథతో ఎంటర్టైన్మెంట్ తో కలిపి ఈ సినిమా ఉండబోతుంది. చిన్నప్పుడు మా అమ్మ నాకు చదువు వ్యాల్యూ గురించి బాగా చెప్పేది. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కూడా వర్క్ చేశాను మద్రాస్ కాలేజీలో. గురువులు, స్టూడెంట్స్ కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది.

    Sir Pre Release Event

     

  • 15 Feb 2023 09:05 PM (IST)

    song launch

    సినిమాలోని మరో పాట మన్నించయ్యా మన్నించయ్య అనే పాటని రిలీజ్ చేశారు. ఈ పాటని రామ జోగయ్య శాస్త్రి గారు రాయగా కాలభైరవ పాడారు

  • 15 Feb 2023 09:03 PM (IST)

    యాంకర్ సుమ

    యాంకర్ సుమ ధనుష్ రఘువరన్ BTech సినిమాలోని డైలాగ్ తన స్టైల్ లో చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

  • 15 Feb 2023 09:01 PM (IST)

    ధనుష్ గ్రాండ్ ఎంట్రీ

    సార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హీరో ధనుష్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. సాంప్రదాయమైన కుర్తా డ్రెస్ లో ఎంట్రీ ఇచ్చారు.

  • 15 Feb 2023 08:59 PM (IST)

    సార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

    సార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత నాగవంశీ, చినబాబు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.

  • 15 Feb 2023 08:54 PM (IST)

    వన్ లైఫ్ సాంగ్

    సినిమాలోని మరో పాట వన్ లైఫ్ అనే సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ పాటని ప్రణవ్ చాగంటి రాయగా, ప్రణవ్, హేమచంద్ర కలిసి రాశారు.

  • 15 Feb 2023 08:48 PM (IST)

    ప్రణవ్ చాగంటి

     

    ఈ సినిమాలో రెండు పాటలు రాసిన ర్యాపర్ ప్రణవ్ చాగంటి ఓ ర్యాప్ సాంగ్ పాడి వినిపించాడు. అలాగే సినిమాలో ఒక బ్యాక్ గ్రౌండ్ సాంగ్ కూడా పాడానని తెలిపాడు. ఇంత పెద్ద ప్రాజెక్టుకి నేను పనిచేసినందుకు చాలా ఆనందంగా ఉంది. నేను రాసిన రెండు పాటల్లో ఒకటి నేను, హేమచంద్ర కలిసి పాడాము. ఇంకో పాట నాకిష్టమైన అనురాగ్ కులకర్ణి పాడారు అని తెలిపాడు.

  • 15 Feb 2023 08:43 PM (IST)

    పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి

     

    సార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ చదువు సబ్జెక్టు మీద ఈ రోజుల్లో సినిమా తీయడం చాలా సాహసం అని చెప్పొచ్చు. డైరెక్టర్ కు అభినందనలు. డైరెక్టర్ ఈ సినిమాకి పాటలు ఫోన్ లోనే మాట్లాడుతూ పని చేయించుకున్నాడు. మాస్టారు మాస్టారు పాట బాగా వైరల్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. మంచి మెలోడీగా నిలిచిపోయింది.

  • 15 Feb 2023 08:35 PM (IST)

    ఫైట్ మాస్టర్స్

    సార్ సినిమాకి వర్క్ చేసిన ఫైట్ మాస్టర్స్ వెంకట్ మాస్టర్, యువరాజ్ మాస్టర్ మాట్లాడుతూ సినిమాలో ఫైట్స్ కూడా ఉన్నాయి. చాలా కొత్తగా ఉంటాయి అని అన్నారు.

  • 15 Feb 2023 08:05 PM (IST)

    సార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

    సాంస్కృతిక కార్యక్రమాలతో సార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ప్రారంభమైంది.

  • 15 Feb 2023 06:47 PM (IST)

    సార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్

    సార్ సినిమా నిర్మాణంలో త్రివిక్రమ్ భార్య కూడా భాగమవడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా హాజరు కానున్నారు. దీంతో త్రివిక్రమ్ అభిమానులు కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో త్రివిక్రమ్ ఏం మాట్లాడతాడా అని ఎదురు చూస్తున్నారు.

  • 15 Feb 2023 06:29 PM (IST)

    10 టీవీతో సార్ సినిమాలో స్టూడెంట్స్ గా చేసిన యాక్టర్స్

    సార్ సినిమాలో స్టూడెంట్స్ గా చేసిన యాక్టర్స్ 10 టీవీతో మాట్లాడుతూ సినిమాలోని బాగా హిట్ అయిన మాస్టారు మాస్టారు సాంగ్ పాడి వినిపించారు.

    Sir Pre Release Event

     

  • 15 Feb 2023 06:25 PM (IST)

    10 టీవీతో సార్ సినిమాలో స్టూడెంట్స్ గా చేసిన యాక్టర్స్

    సార్ సినిమాలో స్టూడెంట్స్ గా చేసిన యాక్టర్స్ 10 టీవీతో మాట్లాడుతూ సినిమా చాలా బాగా వచ్చిందని, ధనుష్ గారితో వర్క్ చేయడం మర్చిపోలేని అనుభవం అని అన్నారు.

    sir pre release event

     

  • 15 Feb 2023 06:08 PM (IST)

    సార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

    సార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుండటంతో ధనుష్ అభిమానులు భారీగా హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వద్దకు చేరుకుంటున్నారు.