Dhanush
Dhanush : అన్ని సినీ పరిశ్రమల వాళ్లకు తెలుగు పరిశ్రమ మంచి మార్కెట్ లా మారింది. మన తెలుగు వాళ్ళ సినిమా బలహీనతతో కేవలం డబ్బుల కోసం తమ సినిమాలని డబ్బింగ్ చేసి ఇక్కడ రిలీజ్ చేసి సంపాదించుకుంటున్నారు. కొంతమంది అయితే అసలు ఇక్కడ ప్రమోషన్స్ కూడా చెయ్యట్లేదు, తెలుగు ప్రేక్షకుల గురించి మాట్లాడట్లేదు. ఇటీవలే రిషబ్ శెట్టి తెలుగు మాట్లాడకుండా వివాదంలో నిలిచిన సంగతి తెలిసిందే.(Dhanush)
ఇప్పుడు ధనుష్ పై కూడా విమర్శలు చేస్తున్నారు. ధనుష్ కి మనం వరుస హిట్స్ ఇస్తున్నాం. ఇటీవల ధనుష్ తెలుగు దర్శకులతో చేసిన సార్, కుబేర సినిమాలు రెండు పెద్ద హిట్ అయ్యాయి. కుబేర తమిళ్ లో ఫ్లాప్ చేసినా మన తెలుగులో హిట్ అయింది. ఇక గతంలో ధనుష్ డైరెక్షన్ చేసిన రాయన్, జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాలు కూడా ఇక్కడ బాగానే ఆడాయి. ధనుష్ కి ఇక్కడ మంచి మార్కెట్ ఉంది, ఫ్యాన్స్ ఉన్నారు.
Also Read : Junior OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన జూనియర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ధనుష్ ఇప్పుడు ఇడ్లీ కొట్టు అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 1న రిలీజ్ కానుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజయి మంచి అంచనాలు నెలకొన్నాయి. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాని చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగులో డబ్బింగ్ తో రిలీజ్ చేస్తున్నారు ఇడ్లీ కొట్టు సినిమాని. అయితే ప్రమోషన్స్ మాత్రం చెయ్యట్లేదు.
ధనుష్ ఇడ్లి కొట్టు సినిమాకు తమిళనాడులో ప్రమోషన్స్ బాగానే చేసారు. కానీ తెలుగులో ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. గతంలో సార్, కుబేర తెలుగు దర్శకులు కాబట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి మాత్రం వచ్చి మాట్లాడాడు. రాయన్ సినిమాలో సందీప్ కిషన్ ఉండటంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు హాజరయ్యాడు. జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాకు కూడా తెలుగులో ప్రమోషన్స్ చేయలేదు. దీంతో తెలుగు సినిమా లవర్స్, నెటిజన్లు కాంతార వివాదంతో లింక్ చేస్తూ ధనుష్ ని కూడా విమర్శిస్తున్నారు. ఇడ్లీ కొట్టు సినిమా కూడా ధనుష్ దర్శకత్వంలోనే తెరకెక్కడం గమనార్హం.
Also Read : Mahakali: అసురగురు శుక్రాచార్య.. మహాకాళి సినిమా నుంచి ఫస్ట్ లుక్ వచ్చేసింది.. ఈ నటుడు ఎవరో గుర్తుపట్టారా?
మార్కెట్ ఉన్నా, ఫ్యాన్స్ ఉన్నా ధనుష్ డైరెక్ట్ చేసినా తన సినిమాని ఇక్కడ రిలీజ్ చేస్తూ కూడా ఒక్క ప్రమోషన్ కూడా తెలుగులో చేయకపోవడం ఏంటో అని కామెంట్స్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ ఉన్నా కూడా ఈ సైలెన్స్ కి కారణం ధనుష్ కే తెలియాలి. మొత్తానికి తెలుగు వర్సెస్ వేరే భాష సినిమాల వివాదం మాత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.