Junior OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన జూనియర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

కన్నడ స్టార్ గాలి కిరీటి హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ జూనియర్. (Junior On Aha)శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బొమ్మరిల్లు బ్యూటీ జెనీలియా కీ రోల్ చేసింది. కాలేజీ బ్యాక్డ్రాప్ లో ఎమోషనల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ రెడ్డి తెరకెక్కించాడు.

Junior OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన జూనియర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Updated On : September 30, 2025 / 2:34 PM IST

Junior OTT: కన్నడ స్టార్ గాలి కిరీటి హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ జూనియర్. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బొమ్మరిల్లు బ్యూటీ జెనీలియా కీ రోల్ చేసింది. కాలేజీ బ్యాక్డ్రాప్ లో ఎమోషనల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ రెడ్డి తెరకెక్కించాడు. ఆడియన్స్ నుంచి కూడా ఈ సినిమాకు పాజిటీవ్ రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది. ఇక సినిమాలో కిరీటి, శ్రీలీల డాన్స్ తో కుమ్మేసిన “వైరల్ వయ్యారి” అనే సాంగ్ ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాను షేక్ చేసింది ఈ పాట. మరీ ముఖ్యంగా హీరో కిరీటి వేసిన డాన్స్ మూవ్స్ అయితే నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి.

Rishab Shetty: హైదరాబాద్ లో వివాదం.. విజయవాడలో వివరణ.. తెలుగు ఆడియన్స్ శాంతిస్తారా?

ఇక ఈ మధ్యే థియేట్రికల్ రన్ ముగించుకున్న జూనియర్ సినిమా ఓటీటీ (Junior OTT) విడుదలకు సిద్ధం అయ్యింది. దసరా కానుకగా సెప్టెంబర్ 30 నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈమేరకు ఆహా సంస్థ అధికారిక ప్రకటన చేసింది. దసరా సెలవులు కావడంతో ఈ సినిమాకు ఆహాలో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. మరి లేట్ ఎందుకు వీలుంటే మీరు కూడా జూనియర్ సినిమాను ఆహా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.