Rishab Shetty: హైదరాబాద్ లో వివాదం.. విజయవాడలో వివరణ.. తెలుగు ఆడియన్స్ శాంతిస్తారా?
కాంతార: చాఫ్టర్ 1పై బైకాట్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. (Rishab Shetty)ఈమధ్య ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద్రాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో హీరో, దర్శకుడు అయిన రిషబ్ శెట్టి తెలుగులో మాట్లాడకపోవటంపై పెద్ద వివాదమే చెలరేగింది.

Rishab Shetty to give explanation about Kantara boycott controversy in Vijayawada
Rishab Shetty: కాంతార: చాఫ్టర్ 1పై బైకాట్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈమధ్య ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద్రాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో హీరో, దర్శకుడు అయిన రిషబ్ శెట్టి తెలుగులో మాట్లాడకపోవటంపై పెద్ద వివాదమే చెలరేగింది. ఈ విషయాన్ని తెలుగు ఆడియన్స్ చాలా పర్సనల్ గా తీసుకున్నారు. మా తెలుగు సినిమాలకు ఇప్పటికే కర్ణాటకలో అవమానం జరుగుతూనే ఉంది. ఇటీవల ఓజీ సినిమా విషయంలో(Rishab Shetty) అది మళ్ళీ రిపీట్ అయ్యింది. ఇప్పుడు ఈవెంట్ లో కూడా కన్నడలో మాట్లాడి అవమానించారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. దీంతో, కాంతార సినిమాపై బైకాట్ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది.
Tamannaah Bhatia: సినిమాల వల్ల కాదా.. ఏంటి తమన్నా అంత మాట అనేసావ్.. మరి నీ ఫ్యాన్స్ సంగతి ఏంటి?
అయితే, హైదరాబాద్ లో జరిగిన తప్పుకు వివరణ ఇచ్చే అవకాశం లభించింది రిషబ్ శెట్టికి. కాంతార: చాఫ్టర్ 1కి సంబందించిన మరో ఈవెంట్ ఈరోజు (సెప్టెంబర్ 30) ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో జరుగనుంది. ఈ ఈవెంట్ మరోసారి రిషబ్ కి మాట్లాడే అవకాశం లభిస్తుంది. కాబట్టి, ఇప్పుడైనా హైదరాబాద్ లో జరిగిన పొరపాటు గురించి వివరణ ఇస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో కాంతార 2 సినిమాకు టికెట్ల పెంపుకు అవకాశం లభించింది. కాబట్టి, ఆ కృతజ్ఞతను సైతం చూపించుకోవాల్సి ఉంటుంది రిషబ్ శెట్టి. మొత్తానికి, విజయవాడలో జరుగబోయే కాంతార: చాఫ్టర్ 1 ఈవెంట్ లో రిషబ్ శెట్టి స్పీచ్ పై ఆసక్తి నెలకొంది.
ఇక కాంతార: చాఫ్టర్ 1 సినిమా విషయానికి వస్తే.. డివోషనల్ హిట్ కాంతార సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రిషబ్ శెట్టి హీరోగా నటించడమే కాదు దర్శకత్వం కూడా వహించాడు. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మొదటి భాగానికి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేసిన అంజనీష్ లోకనాథ్ ఈ సినిమాకి కూడా సంగీతం అందిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.