Tamannaah Bhatia: సినిమాల వల్ల కాదా.. ఏంటి తమన్నా అంత మాట అనేసావ్.. మరి నీ ఫ్యాన్స్ సంగతి ఏంటి?

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం (Tamannaah Bhatia)లేదు. తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

Tamannaah Bhatia: సినిమాల వల్ల కాదా.. ఏంటి తమన్నా అంత మాట అనేసావ్.. మరి నీ ఫ్యాన్స్ సంగతి ఏంటి?

Tamannaah made interesting comments about item songs

Updated On : September 30, 2025 / 12:36 PM IST

Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే, ఈ మధ్య సినిమా అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ ఐటెం సాంగ్స్ చేస్తూ బిజీగా ఉంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే, తాజాగా తన సినిమా జీవితం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తనకు ఈ గుర్తింపు సినిమాల వల్ల రాలేదట. కేవలం ఐటమ్స్ సాంగ్స్ వల్లనే ఫేమస్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చింది. (Tamannaah Bhatia)దాంతో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Mahakali: అసురగురు శుక్రాచార్య.. మహాకాళి సినిమా నుంచి ఫస్ట్ వచ్చేసింది.. ఈ నటుడు ఎవరో గుర్తుపట్టారా?

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. బాలీవుడ్ లో ఓపక్క సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూనే ఐటమ్స్ సాంగ్స్ చేస్తూ వస్తోంది తమన్నా. ఇటీవల ఆమె చేసిన ఐటెం సాంగ్ ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా ఐటమ్స్ సాంగ్స్ గురించి మాట్లాడుతూ.. “నేను తెలుగు, తమిళ్, హిందీ తదితర భాషల్లో చాలా సినిమాలు చేశాను. కానీ, పెద్దగా అవి నా కెరీర్ కి ఉపయోగపడలేదు. కానీ, బద్రీనాథ్ సినిమాలో అల్లు అర్జున్ తో నేను చేసిన డాన్స్ చూసి చాలా మంది నిర్మాతలు ఐటెం సింగ్స్ కోసం నా దగ్గరకు వచ్చారు. అలా సౌత్ తోపాటు హిందీలో నేను చేసిన సాంగ్స్ కి మంచి క్రేజ్ వచ్చింది. అలా వరుసగా ఐటెం సాంగ్స్ చేస్తూనే వస్తున్నాను. సినిమాల కంటే ఐటెం సాంగ్స్ నాకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఇక ముందు కూడా ప్రత్యేక గీతాలు చేయడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చింది తమన్నా.

అయితే, తమన్నా చేసిన ఈ కామెంట్స్ కి ఆమె ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. అదేంటి తమన్నా అంతమాట అన్నావ్. మేమంతా నిన్ను మా హీరోయిన్ గా ఆరాధిస్తుంటే.. నువ్వేమో ఐటెం సాంగ్స్ వల్ల క్రేజ్ వచ్చింది అంటావ్ ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక తెలుగులో తమన్నా చివరగా చిరంజీవి హీరోగా వచ్చిన భోళా శంకర్ సినిమాలో కనిపించింది.