Dhanush new movie Kara teaser released
Danush: రెగ్యులర్ సినిమాలకు కాకుండా ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు తమిళ స్టార్ ధనుష్(Danush). గత ఏడాది తెలుగులో కుబేరా, తమిళ్ లో ఇడ్లీ కడాయ్, హిందీలో తేరే ఇష్క్ మేన్ సినిమాలు చేసి ఆడియన్స్ ను మెప్పించాడు. ఈ మూడు సినిమాల్లో ఇడ్లీ కడాయ్ తప్పా మిగతా రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి సరికొత్త రోల్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు ఈ హీరో.
ఆ సినిమానే ‘కర’. పోర్ తోజిల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు విఘ్నేష్ రాజా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తాజాగా సంక్రాంతి కానుకగా ఈ సినిమా టీజర్, టైటిల్ ను విడుదల చేశారు మేకర్స్. రూరల్ బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ సినిమా సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఒక్క టీజర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఇక ఈ సినిమాతో మరోసారి మరో కొత్త పాత్రలో ఆడియన్స్ ని అలరించేందుకు ఫిక్స్ అయ్యాడని క్లియర్ గా అర్థమవుతోంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని సాధించింది అనేది చూడాలి.