Sivakarthikeyan: పరాశక్తిపై నెగిటీవ్ కామెంట్స్.. నాతో ఎవరు చేయడం లేదు.. నేనేం చేయాలి అంటున్న శివకార్తికేయన్

పరాశక్తి సినిమాపై వచ్చిన నెగిటీవ్ కామెంట్స్ పై స్పందించిన హీరో శివకార్తికేయన్(Sivakarthikeyan).

Sivakarthikeyan: పరాశక్తిపై నెగిటీవ్ కామెంట్స్.. నాతో ఎవరు చేయడం లేదు.. నేనేం చేయాలి అంటున్న శివకార్తికేయన్

Sivakarthikeyan interesting comments about negative comments on Parashakti movie.

Updated On : January 17, 2026 / 11:05 AM IST
  • పరాశక్తి సినిమాకు నెగిటీవ్ టాక్
  • స్పందించిన శివకార్తికేయన్
  • త్వరలో పూర్తి స్థాయి కామెడీ సినిమా చేస్తాడట.

Sivakarthikeyan: తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ గురించి, ఆయన సినిమాల గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఆయన సినిమాలకు తెలుగులో కూడా మంచి డిమాండ్ ఉంది. అలా శివకార్తికేయన్ తెలుగులోను మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది. ఈ హీరో రీసెంట్ గా చేసిన సినిమా పరాశక్తి. లేడీ డైరెక్టర్ సుధా కొంగర తెరకెక్కించిన ఈ పీరియాడికల్ డ్రామాలో శ్రీలీల, జయం రవి, అధర్వ మురళి కీ రోల్స్ చేశారు.

ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, విడుదలకు ముందు మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా.. విడుదల తరువాత మాత్రం ఆ అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యింది. సినిమా చూసిన ఒక్కరు కూడా బాగుంది అనే కామెంట్ చేయకపోవడం గమనార్హం. అయితే, ఈ సినిమా పరాజయానికి చాలా మంది చెప్పిన కారణం ఏంటంటే సినిమాలో ఎంటర్టైన్మెంట్ మిస్ అవడం.

Sri Gouri Priya: పండుగ సంబరాల్లో శ్రీగౌరి ప్రియ.. పతంగ్ ఎగరేస్తూ సరదాగా.. ఫొటోలు

అయితే, ఇదే విషయాన్ని తాజాగా హీరో శివకార్తికేయన్ వద్ద ప్రస్తావించారు. ఇది విషయం గురించి క్లారిటీ ఇచ్చాడు శివకార్తికేయన్(Sivakarthikeyan). “పరాశక్తి సినిమా అనేది నిజంగా జరిగిన కథ. అక్కడ ఎం జరిగిందో అలానే సినిమాలో అదే చూపించారు. అందులో ఎంటర్టైన్మెంట్ లేదనడం నేను కూడా విన్నాను. నిజానికి చాలా మంది నన్ను ఎంటర్టైన్మెంట్ మూవీస్ చేయమని చెప్తున్నారు. నాదగ్గరకు ఎవరూ అలాంటి కథలతో రావడం లేదు.

పరాశక్తి, అమరన్ లాంటి కథలతో కొత్తధనం కోరుకునే ప్రేక్షకులను అలరించాను. కానీ, అదే సమయంలో నాలోని ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ని మిస్ అయ్యాను. ప్రస్తుతం అలాంటి కథతో సినిమా చేసేందుకు చూస్తున్నాను”అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో శివకార్తికేయన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఈ హీరో దర్శకుడు వెంకట్ ప్రభుతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. అలాగే తనకు డాన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన సిబి చక్రవర్తితో మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలాగే విక్రమ్ వేద లాంటి బ్లాక్ బస్టర్ మూవీ చేసిన దర్శద్వయం పుష్కర్ గాయత్రీతో కూడాసినిమా చేయనున్నాడు శివకార్తికేయన్.