Captain Miller Review : ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ రివ్యూ.. యుద్ధ సన్నివేశాల భావోద్వేగం..

ధనుష్ కెప్టెన్ మిల్లర్ రివ్యూ ఏంటి..? యుద్ధ సన్నివేశాలతో ఆకట్టుకున్నారా..?

Captain Miller Review : ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ రివ్యూ.. యుద్ధ సన్నివేశాల భావోద్వేగం..

Dhanush Shivarajkumar sundeep kishan Priyanka Mohan Captain Miller movie review

Updated On : January 26, 2024 / 12:13 AM IST

Captain Miller Review : తమిళ స్టార్ హీరో ధనుష్ కథానాయకుడిగా, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, తెలుగు హీరో సందీప్ కిషన్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించారు. అరుణ్ మాతేశ్వరన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని తమిళంలో సంక్రాంతికి రిలీజ్ చేయగా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేశారు.

కథ విషయానికొస్తే..
స్టోరీ అంతా బ్రిటిషర్స్ టైం పీరియడ్ లో సాగుతుంటుంది. ఒక పక్క బ్రిటిషర్స్‌తో, మరో పక్క రాజపాలకులతో ఇబ్బందులు ఎదురుకుంటూ బానిస బ్రతుకు చూస్తున్న ఒక గ్రామం. ఆ గ్రామానికి చెందిన చెందిన ఇద్దరు అన్నదమ్ములు శివన్న (శివ రాజ్ కుమార్), కెప్టెన్ మిల్లర్ (ధనుష్). శివన్న స్వాతంత్ర పోరాటంలో దేశం కోసం బ్రిటిషర్స్ పై ఫైట్ చేస్తుంటే.. గౌరవం కోసం కెప్టెన్ మిల్లర్ బ్రిటిషర్స్ సైనంలో చేరతాడు.

అక్కడ సైనికుడిగా శిక్షణ తీసుకుంటున్న సమయంలో మిల్లర్ కి కెప్టెన్ రఫిక్ (సందీప్ కిషన్) పరిచయం అవుతారు. ట్రైనింగ్ పూర్తి కాగానే స్వాతంత్ర పోరాటం చేస్తున్న వారిని షూట్ అవుట్ చేయడానికి మిల్లర్ అండ్ రఫిక్ టీం మెంబెర్స్ అందర్నీ తీసుకు వెళ్లి చంపిస్తారు. తమ చేతులతో తమ తోటి భారతీయులను చంపడంతో మిల్లర్ అండ్ రఫిక్ చాలా బాధ పడతారు. ఇక ఆ మరణహోమంతో మిల్లర్ కి కోపం వచ్చి అక్కడే ఉన్న బ్రిటిష్ ఆఫీసర్ ని చంపేసి తన ఊరుకి పారిపోతాడు.

Also read : Padma Awards 2024: తెలుగువారికి పద్మశ్రీ.. పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం

ఊరుకి వెళ్లిన తరువాత తెలుస్తుంది. తాను చంపిన భారతీయుల్లో శివన్న కూడా ఉంటాడని. దీంతో మిల్లర్ ని గ్రామస్తులు ఊరిలోకి రానివ్వరు. అన్నయ్యని చంపాను అన్న గిల్టీ, ఊరులోకి రానివ్వలేదనే బాధతో మిల్లర్.. దేశ తిమ్మరిగా తిరుగుతుంటాడు. ఈ సమయంలోనే రాజన్న అనే ఒక దొంగల ముఠా పరిచయం అవుతుంది. ఆ దొంగల ముఠా బ్రిటిషర్స్ నుంచి ఆయుధాలు దొంగతనం చేసి స్వాతంత్ర పోరాటం చేసే వారికీ అమ్ముతుంటారు.

ఇలా మిల్లర్ ఒక దొంగగా బ్రతుకుతున్న సమయంలో.. మిల్లర్ గ్రామంలోని గుడిలో ఉన్న అమూల్యమైన విగ్రహాన్ని దోచుకొని తమ దేశానికి తీసుకు వెళ్ళడానికి సిద్ధమవుతారు బ్రిటిషర్స్. ఇక ఆ విగ్రహాన్ని బ్రిటిషర్స్ నుంచి దొంగతనం చేయాలని మిల్లర్ కి కాంట్రాక్ట్ ఇస్తాడు. దానిని భారీ ఫైట్ చేసి గెలుచుకున్న మిల్లర్.. తన ముఠాని మోసం చేసి ఆ విగ్రహాన్ని తీసుకోని వేరే దేశం వెళ్ళడానికి పారిపోతాడు.

దీంతో బ్రిటిషర్స్ అంతా కెప్టెన్ మిల్లర్ కోసం అతడి గ్రామం పై యుద్దానికి వస్తారు. ఆ తరువాత ఏం జరిగింది..? కెప్టెన్ మిల్లర్ తిరిగి వచ్చాడా..? శివన్నకి అసలు ఏం జరిగింది..? కెప్టెన్ రఫిక్, మిల్లర్ మళ్ళీ కలుసుకున్నారా..? అనేది వెండితెర పై చూడాల్సిందే.

కథ విశ్లేషణ..
యుద్ధం నేపథ్యంతో సాగే కథ అయినప్పటికీ మూవీని ఆర్ట్ ఫార్మ్‌లో తెరకెక్కించడంతో కొంచెం స్లోగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో పాత్రల పరిచయాలు, వాటి ఎమోషన్స్ తో స్లోగా సాగడంతో కొన్ని చోట్ల బోర్ కలిగిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ మొదలైన దగ్గర నుంచి పవర్ ప్యాకెడ్ యాక్షన్ సన్నివేశాలతో అదుర్స్ అనిపిస్తుంది.

వందల కొద్దీ వచ్చే బ్రిటిషర్స్ సైన్యంతో మిల్లర్ చేసిన యుద్ధం ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. ఈ యుద్ధంలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆడియన్స్ చేత విజుల్స్ వేయిస్తుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా అనిపించినా, సెకండ్ హాఫ్ యుద్ధ సన్నివేశాలతో థ్రిల్ చేయడంతో.. థియేటర్ నుంచి బయటకి వచ్చేటప్పుడు ఒక హై ఫీల్ తోనే ఆడియన్స్ బయటకి వస్తారు. అలాగే సినిమా చివరిలో సెకండ్ పార్టీకి లీడ్ ఇస్తూ చూపించిన సీన్, సెకండ్ పార్ట్ లో పవర్ ఫుల్ విలన్ ఉండబోతున్నాడంటూ ఇచ్చిన హింట్ ఆడియన్స్ కి సెకండ్ పార్ట్ పై ఆసక్తిని క్రియేట్ చేస్తుంది.

నటీనటులు..
సినిమా కథ అంతా ధనుష్ చుట్టూనే తిరుగుతుంది. తప్పు చేసిన సైనికుడిగా ధనుష్ చాలా బాగా నటించారు. ఇక శివ రాజ్ కుమార్, సందీప్ కిషన్ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి అదరగొట్టారు. రాజకుటుంబంలో పుట్టిన హీరోయిన్ ప్రియాంక మోహన్.. ఇంటి నుంచి పారిపోయి స్వాతంత్ర కోసం పోరాడే అమ్మాయిగా ఆకట్టుకుంది. అలాగే విలన్ అండ్ ఇంపార్టెంట్ రోల్స్ పోషించిన వారు కూడా పూర్తి స్థాయి న్యాయం చేసారు అనే చెప్పాలి.

సాంకేతిక విషయాలకు వస్తే..
కథకి అనుగుణంగా జివి ప్రకాష్ సంగీతం బాగానే ఆకట్టుకుంది. అయితే కొన్ని ఎలివేషన్ సీన్స్ కి తగ్గట్టు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మిస్ అయ్యిందని అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ కొత్త ఫీలింగ్ నే ఇస్తుంది. డైరెక్షన్ విషయానికి వస్తే.. స్క్రీన్ ప్లే ఇంకొంచెం సానపెట్టి ఉంటే బాగుండు. మొత్తం మీద సినిమాకి 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ రివ్యూ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.