Padma Awards 2024: తెలుగువారికి పద్మశ్రీ.. పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం

తెలంగాణలోని నారాయణపేట జిల్లా దామరగిద్దకు చెందిన బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్పకు పద్మశ్రీ దక్కింది. ఈ సారి మొత్తం 110 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసినట్లు కేంద్రం తెలిపింది.

Padma Awards 2024: తెలుగువారికి పద్మశ్రీ.. పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం

Padma Awards 2024

కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను ప్రకటిస్తున్నట్లు తెలిపింది. ఈ సారి మొత్తం 110 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసినట్లు తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లో పద్మశ్రీ వీరికే..

  • దాసరి కొండప్ప-తెలంగాణలోని నారాయణపేట జిల్లా దామరగిద్దకు చెందిన బుర్రవీణ వాయిద్యకారుడు
  • గడ్డం సమ్మయ్య- జనగామకు చెందిన యక్షగాన కళాకారుడు
  • ఉమా మహేశ్వరి- ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హరికథ కళాకారిణి

పద్మశ్రీ వీరికే..

  • దుఖు మజ్హి – సింద్రీ గ్రామ పర్యావరణ కార్యకర్త
  • చెల్లమ్మాళ్ – అండమాన్‌కు చెందిన సేంద్రియ రైతు
  • హేమ్‌చంద్ మాంఝీ – నారాయణ్‌పూర్‌కు చెందిన మెడిసినల్ ప్రాక్టీషనర్
  • యానుంగ్ జమోహ్ లెగో – అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన హెర్బల్ మెడిసిన్ నిపుణుడు
  • సోమన్న – మైసూరుకు చెందిన గిరిజన సంక్షేమ కార్యకర్త
  • సర్బేశ్వర్ బాసుమతరీ – చిరంగ్ ప్రేమ ధనరాజ్‌కు చెందిన గిరిజన రైతు
  • వీరితో పాటు మొత్తం 110 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి


Padma Awards 2024

 


Padma Awards 2024


Padma Awards 2024