Dhanush Sir Premiere Shows: ఒక రోజు ముందే చెన్నై, హైదరాబాద్‌లో ‘సార్’ ప్రీమియర్ షోలు.. అన్నీ హౌస్‌ఫుల్..

సార్ సినిమాకి ఇటీవల కాలంలో ఏ సినిమా చేయని సాహసం చేసి ఒక రోజు ముందే ప్రీమియర్ షోలు వేశారు. సినిమా 17న రిలీజ్ అవుతుండగా ఒక రోజు ముందే 16న రాత్రి చెన్నై, హైదరాబాద్ లోని థియేటర్లలో ప్రీమియర్ వేస్తున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్ లోని

Dhanush Sir Movie Premiere Shows all Housefull in Chennai and Hyderabad

Dhanush Premiere Shows : ధనుష్, సంయుక్త మీనన్ జంటగా డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కుతున్న బైలింగ్వల్ సినిమా వాతి. తెలుగులో సార్ సినిమాగా రాబోతుంది. ఫిబ్రవరి 17న శివరాత్రి కానుకగా ఈ సినిమా తమిళ్, తెలుగు భాషలతో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచారు. చిత్రయూనిట్ ప్రస్తుతం అటు తమిళనాడులో, ఇటు తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ తో బిజీబిజీగా ఉంది. తాజాగా సార్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి ధనుష్ తో పాటు చిత్రయూనిట్ అంతా హాజరయ్యారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Hyper Aadi : త్రివిక్రమ్ రేంజ్ లో త్రివిక్రమ్ మీదే స్పీచ్ ఇచ్చిన హైపర్ ఆది..

ఇక సార్ సినిమాకి ఇటీవల కాలంలో ఏ సినిమా చేయని సాహసం చేసి ఒక రోజు ముందే ప్రీమియర్ షోలు వేశారు. సినిమా 17న రిలీజ్ అవుతుండగా ఒక రోజు ముందే 16న రాత్రి చెన్నై, హైదరాబాద్ లోని థియేటర్లలో ప్రీమియర్ వేస్తున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమ్యాక్స్ లో సార్ సినిమా 3 ప్రీమియర్ షోలు వేస్తున్నారు. అయితే ప్రీమియర్ ప్రకటించిన గంటకే అన్ని షోల టికెట్స్ అయిపోయి షో హౌస్ ఫుల్ అవ్వడం విశేషం. దీంతో సార్ సినిమా కోసం ధనుష్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రీమియర్ షోలు హౌస్ ఫుల్ అవ్వడంతో చిత్రయూనిట్ మరింత కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా విజయం పై.