Dhanush speech in sir movie pre release event
Dhanush : ధనుష్, సంయుక్త మీనన్ జంటగా డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కుతున్న బైలింగ్వల్ సినిమా సార్. తమిళ్ లో వాతిగా తెరకెక్కుతున్న సినిమా తెలుగులో సార్ గా రానుంది. ఫిబ్రవరి 17న శివరాత్రి కానుకగా ఈ సినిమా తమిళ్, తెలుగు భాషలతో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచారు. ధనుష్ అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. చిత్రయూనిట్ ప్రస్తుతం అటు తమిళనాడులో, ఇటు తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ తో బిజీబిజీగా ఉంది. ఇప్పటికే ట్రైలర్ లాంచ్, ఆడియో లాంచ్, ప్రెస్ మీట్ లు నిర్వహించగా తాజాగా సార్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో నేడు ఫిబ్రవరి 15 సాయంత్రం గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి ధనుష్ తో పాటు చిత్రయూనిట్ అంతా హాజరయ్యారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ధనుష్ మాట్లాడుతూ.. తమిళ్ వచ్చు, తెలుగు కొంచెం కొంచెమే వచ్చు అని చెప్పడంతో త్రివిక్రమ్ డబ్బింగ్ చెప్తా అన్నారు. ధనుష్ మాట్లాడుతుంటే మధ్య మధ్యలో త్రివిక్రమ్ తెలుగు హెల్ప్ చేశారు. 2002లో మొదటి సినిమా తమిళ్ లో రిలీజ్ అయినప్పుడు చాలా నెర్వస్ గా ఉన్నాను. ఇప్పుడు 2023లో తెలుగు మొదటి సినిమా రిలీజ్ అవుతుంది ఇప్పుడు కూడా నెర్వస్ గా ఉంది. నా మొదటి సినిమాలాగా ఫీల్ అవుతాను. ఇక్కడ ఉన్న అందరు అన్ని లాంగ్వేజెస్ మాట్లాడుతున్నారు. నాకు ఒక్కడికే ఒక్క తమిళ్ వచ్చు. సముద్రఖని గారికి తెలుగు రాదు అనుకున్నాను, ఆయన కూడా తెలుగు మాట్లాడారు. చాలా సింపుల్ సినిమా ఇది. సింపుల్ స్టోరీ, గ్రాండ్ మెసేజ్. ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. వంశీ, వెంకీ చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు, నాకు ఇంకా భయం వేస్తుంది. ఇది మీ అందరి కథ. డైరెక్టర్ కి థ్యాంక్స్ చెప్పాలి మంచి కథ తీసుకొచ్చినందుకు. త్రివిక్రమ్ గారు నాకు చాలా మంచి వెల్కమ్ ఇచ్చారు. షూటింగ్ లో డైలీ సాయి కుమార్ గారి ఇంటి నుంచి లంచ్ తెచ్చారు. మీ భార్యకు కూడా థ్యాంక్స్ చెప్పండి. హైపర్ ఆది క్రేజ్ చూసి షాక్ అయ్యాను. అతని పేరు చెప్పగానే విజిల్స్, అరుపులు వినిపిస్తున్నాయి ఇక్కడ అని అనడంతో త్రివిక్రమ్ జబర్దస్త్ వల్ల ఫేమస్ అయ్యాడు అని చెప్తే ధనుష్ యూట్యూబ్ లో చూస్తాను అని చెప్పారు. అలాగే తమన్ నా ఫ్యామిలీ మెంబర్ లాంటి వాడు. అఖండలో మీ వర్క్ బాగా నచ్చింది. GV దీనికి మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమా అందరికి నచ్చుతుంది. నెక్స్ట్ తెలుగు సినిమా వరకు తెలుగు నేర్చుకొని తెలుగు స్పీచ్ ఇస్తాను. సుమ గారు సూపర్. అని చెప్పారు. అలాగే స్టేజి మీద మాస్టారు మాస్టారు సాంగ్ పాడి అందర్నీ అలరించారు ధనుష్.