Trivikram Srinivas : ఇంజనీరింగ్ చదవటానికి డబ్బుల్లేక డిగ్రీ చదివాను.. ఈ సినిమా చూసి మా నాన్న బాధపడటం గుర్తొచ్చింది..

సార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో త్రివిక్రమ్ మాట్లాడుతూ.. కబీర్ చెప్పిన ఒక పద్యం చెప్పారు గురువులకు సంబంధించినది. కరోనా టైములో జూమ్ కాల్ లో నాకు కథ చెప్పాడు. మా ఆవిడ కూడా ఈ సినిమాకి నిర్మాత. సినిమా చూసింది ఆల్రెడీ...............

Trivikram Srinivas : ఇంజనీరింగ్ చదవటానికి డబ్బుల్లేక డిగ్రీ చదివాను.. ఈ సినిమా చూసి మా నాన్న బాధపడటం గుర్తొచ్చింది..

Trivikram Srinivas speech in dhanush sir movie pre release event

Updated On : February 15, 2023 / 11:00 PM IST

Trivikram Srinivas :  ధనుష్, సంయుక్త మీనన్ జంటగా డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కుతున్న బైలింగ్వల్ సినిమా సార్. తమిళ్ లో వాతిగా తెరకెక్కుతున్న సినిమా తెలుగులో సార్ గా రానుంది. ఫిబ్రవరి 17న శివరాత్రి కానుకగా ఈ సినిమా తమిళ్, తెలుగు భాషలతో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచారు. ధనుష్ అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. చిత్రయూనిట్ ప్రస్తుతం అటు తమిళనాడులో, ఇటు తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ తో బిజీబిజీగా ఉంది. ఇప్పటికే ట్రైలర్ లాంచ్, ఆడియో లాంచ్, ప్రెస్ మీట్ లు నిర్వహించగా తాజాగా సార్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో నేడు ఫిబ్రవరి 15 సాయంత్రం గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి ధనుష్ తో పాటు చిత్రయూనిట్ అంతా హాజరయ్యారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో త్రివిక్రమ్ మాట్లాడుతూ.. కబీర్ చెప్పిన ఒక పద్యం చెప్పారు గురువులకు సంబంధించినది. కరోనా టైములో జూమ్ కాల్ లో నాకు కథ చెప్పాడు. మా ఆవిడ కూడా ఈ సినిమాకి నిర్మాత. సినిమా చూసింది ఆల్రెడీ, బాగా వచ్చింది అని చెప్పింది. ఈ సినిమా నాకు కూడా చాలా నచ్చింది. విద్య, వైద్యం అనే మౌలిక సదుపాయాలు డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు అని తేడా లేకుండా అందరికి అందచేయాలి. కానీ అవే దూరం అవుతున్నాయి. మనిషిని చదువు మారుస్తుంది. ఎవరినైనా గొప్పగా మారుస్తుంది చదువు. డబ్బు లేకపోతే చదువు దూరం చేస్తారా అనే ప్రశ్నే ఈ సినిమా. ఇప్పుడు చదువు lkg, ukg లోనే బాగా ఖరీదు అయిపోతుంది. వెంకీ బాగా కష్టపడ్డాడు. డబ్బులు లేక ఇంజనీరింగ్ చేయలేక డిగ్రీ చదువుకున్నా. ఈ సినిమాలో ఒక డైలాగ్ అమ్మ నాన్నల గురించి రాసాడు. మా నాన్న గుర్తొచ్చారు ఆ డైలాగ్ విన్నాక. జల్సాలో ఇలాంటి డైలాగ్ రాశాను ఒకటి. పీరియాడిక్ ఫిలింగా తీశారు కానీ ఆ కథ ఇప్పటికి సరిపోతుంది. గురువుల గురించి చాలా బాగా చెప్పారు. నేను లెక్చరర్ గా చేశాను. ధనుష్ రఘువరన్ BTech సినిమా చాలా మందిని మోటివేట్ చేసింది. ఇప్పటికి చేస్తుంది. సార్ సినిమా కూడా అలాగే చాలా రోజులు మనకి వినిపిస్తుంది. ధనుష్ గొప్ప నటుడు. సినిమా విజయం, అపజయం మీద భయం లేదు ధనుష్ కి. పని చేసుకుంటూ వెళ్తాడు. ధనుష్ ని ఎవ్వరూ ఆపలేడు. తెలుగు వాళ్ళు సినిమా బాగుంటే ఎవర్నైనా ఆదరిస్తారు. ఇప్పుడు లాంగ్వేజ్ బారియర్ లేదు. ధనుష్ అందరివాడు. ధనుష్ ని తెలుగులో నేను నిర్మాతగా పరిచయం చేస్తున్నందుకు గర్విస్తున్నాను. తెలుగులో మొదటి అడుగు గర్వంగా వేస్తున్నారు. డైరెక్టర్ చాలా మంచి సినిమా చేశాడు. సక్సెస్ కొట్టాడు. తమన్ నాకు బ్రదర్ లాంటి వాడు. సాయి కుమార్ అండర్ రేటెడ్ యాక్టర్. అయన ఇంకా చాలా సినిమాలు చేయాలి. ఆదితో చాలా విషయాలు పర్సనల్ గా మాట్లాడాలి. ఆది ప్రేమకి నేను ఆనందిస్తున్నాను. మా ఆవిడ కూడా హిట్ కొట్టింది ఈ సినిమాతో. ధనుష్ కి తెలుగులో గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నాం. సినిమా అందరికి నచ్చుతుంది. నిర్మాత చినబాబు గారు నెగిటివ్ కామెంట్స్ చెప్పకపోతే సినిమా హిట్ అయినట్టే. ఈ సినిమాకి ఒక్క నెగిటివ్ కూడా చెప్పలేదు. అందుకే అందరం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం అని అన్నారు. చివర్లో సుమ రోజూ సాయంత్రం డైలీ స్టేజి మీదే ఉంటారు. డైలీ వాళ్ళింట్లో రాజీవ్ గారే వంట చేస్తారు. వంట విషయంలో నేను చేసిన ఒక పనికి నన్ను మా ఆవిడ తిట్టింది. మళ్ళీ వంట రూమ్ లోకి రావొద్దు అని చెప్పింది అని సరదాగా చెప్పారు.

Telugu Indian Idol 2 : ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 జడ్జీలు, యాంకర్ వీళ్ళే..

త్రివిక్రమ్ డబ్బుల్లేక ఇంజనీరింగ్ చదువుకోలేదు, వాళ్ళ నాన్న బాధపడి ఉంటారు అని చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. దీంతో చదువు ఇంపార్టెన్స్ గురించి అయినా ఈ సినిమా చూడాలి అని అంతా అనుకుంటున్నారు.