D50 : ధనుష్ 50వ సినిమా టైటిల్ ఫిక్స్.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్
తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పని లేదు.
- Thota Vamshi Kumar
- Published On : February 19, 2024 / 07:07 PM IST
Dhanush's D50 is titled Raayan first look poster out
తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పని లేదు. ఆయన నటించిన చిత్రాలు తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల అవుతుంటాయి. కమర్షియల్ చిత్రాలతో పాటు కొత్త తరహా సినిమాలు చేయడంలో ఆయన ముందుంటారు. తాజాగా తన స్వీయ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ధనుష్ కెరీర్‌లో 50వ సినిమాగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.
ఈ చిత్రానికి ‘రాయన్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ధనుష్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ధనుష్ ఓ ఫుడ్ ట్రక్ ముందు నిలబడి ఉన్నాడు. అతను క్లోజ్డ్-క్రాప్డ్ లుక్, మీసాలతో ఉన్నాడు. ఎరుపు రంగు చొక్కా ధరించాడు. దానిపై ఆప్రాన్ ఉంది. ఆ ఆఫ్రాన్ మొత్తం రక్తం మరకలతో కనిపిస్తోంది. చేతిలో ఓ రకమైన ఆయుధాన్ని పట్టుకున్నాడు. వెనుక ట్రక్‌లో సందీప్ కిషన్‌తో పాటు మరో నటుడు ఉన్నాడు. మొత్తంగా ఈ ఫస్ట్‌లుక్ ఆకట్టుకుంటోంది.
Varun Tej : మెగా ప్రిన్స్ కోసం.. రంగంలోకి రామ్ చరణ్, సల్మాన్ ఖాన్
ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.
#D50 is #Raayan ?
? Written & Directed by @dhanushkraja
? Music by @arrahmanReleasing in Tamil | Telugu | Hindi@omdop @editor_prasanna @kalidas700 @sundeepkishan @PeterHeinOffl @jacki_art @kavya_sriram @kabilanchelliah @theSreyas @RIAZtheboss #D50FirstLook pic.twitter.com/vfemOIRKIX
— Sun Pictures (@sunpictures) February 19, 2024
