Varun Tej : మెగా ప్రిన్స్‌ కోసం.. రంగంలోకి రామ్ చరణ్, సల్మాన్ ఖాన్

మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ న‌టిస్తున్న సినిమా ఆప‌రేష‌న్ వాలెంటైన్‌.

Varun Tej : మెగా ప్రిన్స్‌ కోసం.. రంగంలోకి రామ్ చరణ్, సల్మాన్ ఖాన్

Operation Valentine theatrical trailer to release on February 20th

Varun Tej – Operation Valentine : మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ న‌టిస్తున్న సినిమా ఆప‌రేష‌న్ వాలెంటైన్‌. శ‌క్తి ప్ర‌తాప్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరెక్కుతున్న ఈ సినిమాలో వ‌రుణ్ స‌ర‌స‌న మానుషి చిల్ల‌ర్ న‌టిస్తోంది. ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్‌లో యాక్ష‌న్ థ్రిల‌ర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. మిక్కీ జే మేయ‌ర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం మార్చి 1న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలోనే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది.

ఇప్ప‌టికే ఈ సినిమాలోని పాట‌ల‌ను విడుద‌ల చేసింది. తాజాగా ట్రైల‌ర్ ను విడుద‌ల చేసేందుకు ముహూర్తాన్ని ఫిక్ చేసింది. ఆపరేషన్ వాలెంటైన్ నుంచి ‘ఫైనల్ స్ట్రైక్’ ఫిబ్ర‌వ‌రి 20న రానున్న‌ట్లు వెల్ల‌డించింది. మంగ‌ళ‌వారం ఉద‌యం 11.05 నిమిషాల‌కు ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.

తెలుగు ట్రైల‌ర్‌ను మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ విడుద‌ల చేయ‌నుండ‌గా, హిందీ ట్రైల‌ర్‌ను బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ రిలీజ్ చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం వెల్ల‌డించింది.

Chiranjeevi : అమెరికాలో పద్మవిభూషణ్ చిరంజీవికి ఘన సత్కారం.. వీడియో వైరల్

ఇంత‌కంటే ఇంకేం కావాలి.. భాయ్‌తో పాటు భాయిజాన్ ఇద్ద‌రూ క‌లిసి ఆప‌రేష‌న్ వాలెంటైన్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేస్తున్నారు అని వ‌రుణ్ తేజ్ సోష‌ల్ మీడియాలో రాసుకొచ్చాడు.

కాగా.. పాన్ ఇండియా సినిమాగా విడుద‌ల‌వుతున్న‌ ఆపరేషన్ వాలెంటైన్ కోసం వరుణ్, మానుషీలు ఇండియా మొత్తం తిరుగుతూ ప్రమోషన్స్ చేస్తున్నారు.