Drinker Sai : ‘డ్రింకర్ సాయి’ ట్రైలర్ రిలీజ్.. గుప్పెడంత గుండెకు సముద్రమంత గాయం..

మీరు కూడా డ్రింకర్ సాయి ట్రైలర్ చూసేయండి..

Drinker Sai : ‘డ్రింకర్ సాయి’ ట్రైలర్ రిలీజ్.. గుప్పెడంత గుండెకు సముద్రమంత గాయం..

Dharma Aishwarya Sharma Drinker Sai Trailer Released

Updated On : December 9, 2024 / 4:12 PM IST

Drinker Sai Trailer : ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘డ్రింకర్ సాయి’. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా రానుంది. ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మాణంలో కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

Also Read : Pushpa 2 Collections : బాబోయ్.. ఊహించిన దానికంటే ఎక్కువ.. పుష్ప 2 నాలుగు రోజుల కలెక్షన్స్ ఎంతో తెలుసా?

ఇప్పటికే డ్రింకర్ సాయి సినిమా నుంచి టీజర్, సాంగ్స్ రిలీజ్ చెయ్యగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఓ డ్రింకర్ లవ్ స్టోరీ అని తెలుస్తుంది. ప్రేమించిన అమ్మాయి ముందు ఓకే చెప్పి తర్వాత నో చెప్తే ఆ బాధ ఎలా ఉంటుంది అనే పాయింట్ లో స్టోరీ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. మీరు కూడా డ్రింకర్ సాయి ట్రైలర్ చూసేయండి..

డ్రింకర్ సాయి సినిమా డిసెంబర్ 27న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాలో పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, ఎస్ఎస్ కాంచి, భద్రం, కిర్రాక్ సీత, రీతు చౌదరి, ఫన్ బకెట్ రాజేశ్.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.