Dharmavarapu Subrahmanyam Wife
Dharmavarapu Subrahmanyam Wife : హాస్య నటులు ధర్మవరపు సుబ్రహ్మణ్యంని తెలుగు ప్రేక్షకులు మర్చిపోరు. రంగస్థలం నుంచి టీవీ స్క్రీన్ అటు నుండి వెండితెరకు వచ్చి ఎన్నో పాత్రలు పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. క్యాన్సర్ బారిన పడి కన్నుమూసిన ఆయన చివరి రోజుల్లో చాలా మానసిక వేదన అనుభవించినట్లు రీసెంట్‌గా ఆయన వైఫ్ కృష్ణజ మీడియాతో చెప్పారు. ఆయన ఇష్టాలు.. చివరి కోరిక గురించి షేర్ చేసుకున్నారు.
బుల్లితెరతో పాటు వెండితెరపై తనదనే నటనతో పేరు తెచ్చుకున్నారు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. రచయితగా, దర్శకుడిగా కూడా అనుభవం ఉంది. జంధ్యాలగారి సినిమా ‘జయమ్ము నిశ్చయమ్మురా’ తో సినిమాల్లోకి వచ్చి చాలా సినిమాల్లోనే నటించారు. సినిమాలతో పాటు అటు రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్న తరుణంలో అకస్మాత్తుగా అనారోగ్యం బారిన పడ్డారు. లివర్ క్యాన్సర్ 4వ స్టేజ్‌లో ఉన్నట్లు గుర్తించడంతో ఆయన ఒక్కసారిగా డీలా పడిపోయారు. క్యాన్సర్‌తో దాదాపు ఏడాది కాలం పోరాడిన ఆయన 2013 లో కన్నుమూసారు.
Hi Nanna : నాని ‘హాయ్ నాన్న’ సినిమా.. నాగార్జున సినిమా కథేనా? లేదా తమిళ్ సినిమా కథా?
ధర్మవరపు సుబ్రహ్మణ్యం అనారోగ్యంగా ఉన్న సమయంలో చిన్నపిల్లవాడిలా ఏడ్చేవారని భార్య కృష్ణజ చెప్పారు. తన పరిస్థితి ఇలా అయిపోయిందేంటని బాధపడేవారట. అయితే ఆమె ఎంతో ధైర్యం చెప్పేవారట. ధర్మవరపు సుబ్రహ్మణ్యంకి మనవల్ని చూడాలని కోరిక ఉండేదట. ఆ కోరిక తీరకుండానే వెళ్లిపోయారు. తను లేకపోయినా తన పేరు నిలబెట్టాలని రెండవ కొడుకు తేజ దగ్గర మాట తీసుకున్నారట. ధర్మవరపు సుబ్రహ్మణ్యం పెద్ద కొడుకు సందీప్ బిజినెస్‌లో స్థిరపడ్డారు. రెండవ కొడుకు రవిబ్రహ్మతేజ కూడా ఉద్యోగం చేసి మానేసి ప్రస్తుతం తండ్రి బాటలో వెళ్లాలని నిర్ణయించుకున్నారట. తన భర్తలాగ తేజ కమెడియన్‌లా మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను అని కృష్ణజ తన మనసులోని మాట చెప్పారు. తేజకు మంచి అవకాశాలు వచ్చి తండ్రి పేరు నిలబెట్టాలని ఆశిద్దాం.