Dhee Dance choreographer Chaitanya passed away
Chaitanya : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఢీ డాన్స్ షో (Dhee Dance), జబర్దస్త్ (Jabardasth) ఎంతటి పాపులారిటీని సంపాదించుకున్నాయి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ షోస్ కనిపించే కంటెస్టెంట్స్ మంచి ఫేమ్ వచ్చింది. అయితే ఆ ఫేమ్ తమని ఆర్ధికంగా నిలబెట్టలేకపోయింది అంటూ ఒక డాన్స్ మాస్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఢీ షోలో డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా రాణిస్తున్న చైతన్య నెల్లూరులోని క్లబ్ హోటల్ లో సూసైడ్ చేసుకున్నాడు. అంతకుముందు ఒక సెల్ఫీ వీడియో చిత్రీకరించాడు.
Priyanka Chopra Citadel : వరల్డ్ టాప్ వెబ్ సిరీస్‌గా ప్రియాంక సిటాడెల్.. సమంత ఏమి చేస్తుందో?
ఆ వీడియోలో ఆర్థిక ఇబ్బందులు వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు చేయడంతో అప్పులు పెరిగిపోయాయని, అప్పు ఇచ్చిన వారి నుంచి వస్తున్న ప్రెజర్ తట్టుకోలేకపోతున్నాని ఆ వీడియోలో వెల్లడించాడు. ఈ సమస్యలను ఎదురుకోడానికి చాలా ప్రయత్నం చేశాడని కానీ తన వల్ల కాలేదని, అందుకే సూసైడ్ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. అలా చేస్తునందుకు తన కుటుంబ సబ్యులకు, తోటి డాన్సర్స్ కి, స్నేహితులకు క్షమాపణలు తెలియజేశాడు.
ఢీ షో తనకి ఎంతో ఫేమ్ ని సంపాదించి పెట్టిందని, అందుకు రుణపడి ఉంటానని తెలిపిన చైతన్య.. ఢీ షోలో సంపాదన చాలా తక్కువ ఇస్తున్నారని వెల్లడించాడు. ఢీ కంటే జబర్దస్త్ షోలోనే ఎక్కువ మనీ ఇస్తారంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సెల్ఫీ వీడియో అనంతరం నెల్లూరు క్లబ్ హోటల్ లోనే చైతన్య ఉరేసుకొని చనిపోయాడు. అయితే ఈ ఘటనకు చైతన్యకు సన్మాన కార్యక్రమం జరిగింది. టౌన్ హాల్ లో నిన్న (ఏప్రిల్ 29) జరిగిన కళాంజలి ప్రపంచ నృత్య దినోత్సవ సందర్భంగా సన్మాన కార్యక్రమానికి చైతన్య హాజరయ్యాడు. ఇక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు చైతన్య మృతదేహాన్ని స్వస్థలం నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలం ఉత్తమ వారి పాలెంకి తరలించారు.