NTR
NTR : డ్యాన్సర్లు ఎంత బాగా డ్యాన్స్ చేసి మెప్పిస్తారో, ఆ డ్యాన్స్ లో దెబ్బలు తగిలించుకొని బాధ పడతారు కూడా. ఢీ షోతో ఎంతోమంది డ్యాన్సర్స్ తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యారు. అందులో రాజు ఒకరు. బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ గా ఢీ షోకి వచ్చి కంటెస్టెంట్ గా మారి ఢీ 10 టైటిల్ విన్ అయ్యాడు. ఢీ షోతో రాజు మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు.(NTR)
రాజు చేసిన ఢీ 10 షోకి ఫైనల్ ఎపిసోడ్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరయ్యారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా రాజు షీల్డ్ అందుకున్నాడు. తాజాగా రాజు ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా అప్పుడు ఫైనల్ ఎపిసోడ్ ముందు తను పడిన కష్టం, గెలిచాక ఎన్టీఆర్ అన్న మాటల గురించి చెప్పుకొచ్చాడు.
Also Read : Pawan Kalyan : కుంకీ ఏనుగులకు ఆహారం అందించి.. ఆశీర్వాదం తీసుకొని.. డిప్యూటీ సీఎం ఫొటోలు..
రాజు మాట్లాడుతూ.. ఢీ 10 టైటిల్ ఫైనల్ షూట్. రేపు ఎన్టీఆర్ గెస్ట్ గా వస్తున్నారు ఫైనల్ కి అంటే ముందు రోజు నేను వీల్ చైర్ లో ఉన్నా. నా రెండు మోకాళ్ళు పనిచేయలేదు. వాటర్ వచ్చేసి ఉబ్బిపోయాయి. నేను కనీసం నడవలేకపోయాను. అలాంటిది ఇంక ఫైనల్ డ్యాన్స్ ఏం చేస్తాను అనుకున్నాను. కానీ హాస్పిటల్ కి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చాను. వచ్చేటప్పుడు చర్చ్ లో మోకాళ్ళ మీద పెయిన్ తోనే ప్రార్థన చేశా. ట్రీట్మెంట్ చేయించుకోవడంతో పెయిన్ ఉన్నా డ్యాన్స్ చేయగలిగాను. ఫుల్ పెయిన్ తోనే డ్యాన్స్ వేసేసా. ఇంకా పెయిన్ వచ్చింది. అయినా డ్యాన్స్ వేసి గెలిచాను. ఎన్టీఆర్ గారి చేతుల మీదుగా షీల్డ్ అందుకున్నాను అని తెలిపాడు.
అనంతరం తన డ్యాన్స్ చూసి ఎన్టీఆర్.. డ్యాన్స్ అంటే పైన తల వెంట్రుకల నుంచి కింద కాలి గోటి వరకు అన్ని కదలాలి. అది నీలో చూసాను అని మెచ్చుకున్నట్టు తెలిపాడు రాజు.
Also Read : Dhee Raju : చైతన్య మాస్టర్ సూసైడ్.. లాస్ట్ కాల్ రాజుకి చేసి.. అన్నం పెట్టినోడే ఆత్మహత్య చేసుకునేసరికి రాజు..