Kalinga Teaser : బాబోయ్.. కళింగ టీజర్ చూశారా? సస్పెన్స్ థ్రిల్లింగ్ తో భయపెట్టి..

కళింగ టీజర్ ని బాలీవుడ్ స్టార్ నటుడు జాకీ ష్రాఫ్ రిలీజ్ చేసారు.

Kalinga Teaser : బాబోయ్.. కళింగ టీజర్ చూశారా? సస్పెన్స్ థ్రిల్లింగ్ తో భయపెట్టి..

Dhruva Vaayu Kalinga Teaser Released by Jackie Shroff

Updated On : August 6, 2024 / 10:23 AM IST

Kalinga Teaser : కిరోసిన్ సినిమా ఫేమ్ ధృవ వాయు హీరోగా నటిస్తూనే దర్శకత్వం వహిస్తూ ‘కళింగ’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్‌ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ప్రగ్యా నయన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఆడుకాలం నరేన్, లక్ష్మణ్ మీసాల, తనికెళ్ళ భరణి, సమ్మెట గాంధీ.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటికే కళింగ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా తాజాగా కళింగ టీజర్ రిలీజ్ చేసారు. ఈ టీజర్లో.. మొదట్లోనే ఒక అమ్మాయి తన చెవిని తానే కోసుకుని తినే ఒళ్లు గగుర్పొడిచే సీన్ చూపెట్టారు. రాజులు ఒక అడవిలో సంపద దాచారని, ఒక పొలిమేర దాటకూడదు అని, దాటితే ఏమవుతుంది? ఆ సంపద కోసం ప్రయత్నిస్తే ఏమవుతుందని కళింగ టీజర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంటూనే ప్రేక్షకులని భయపెట్టింది. అలాగే సినిమాలో ఓ లవ్ స్టోరీ కూడా ఉండబోతుందని తెలుస్తుంది. మీరు కూడా కళింగ టీజర్ చూసేయండి..

ఇక ఈ కళింగ టీజర్ ని బాలీవుడ్ స్టార్ నటుడు జాకీ ష్రాఫ్ రిలీజ్ చేసారు. టీజర్ తో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

Dhruva Vaayu Kalinga Teaser Released by Jackie Shroff