Dhurandhar : వామ్మో ఏడున్నర గంటల సినిమా.. రిలీజ్ కి రెడీ చేస్తున్న మూవీ టీమ్..

దురంధర్ రెండు పార్టులు కూడా చాలా నిడివి ఎక్కువ ఉన్న సినిమాలు. (Dhurandhar)

  • Published On : April 1, 2026 / 03:44 PM IST

Dhurandhar

Dhurandhar : రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన దురంధర్, దురంధర్ పార్ట్ 2 సినిమాలు భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ లో ఇండియన్ ఏజెంట్ ఏం చేసాడు అనే కథాంశంతో స్పై యాక్షన్ గా రియల్ ఇన్సిడెంట్స్ ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన ఈ సినిమా దేశమంతా ప్రేక్షకులని మెప్పించింది. ఫస్ట్ పార్ట్ మించి సెకండ్ పార్ట్ పెద్ద హిట్ అయింది.

అయితే దురంధర్ రెండు పార్టులు కూడా చాలా నిడివి ఎక్కువ ఉన్న సినిమాలు. ఫస్ట్ పార్ట్ 3 గంటల 34 నిముషాలు నిడివి కాగా దురంధర్ పార్ట్ 2 మూడు గంటల 50 నిముషాలు. ఈ రెండు సినిమాలు కాకుండా ఎడిటింగ్ లో తీసేసింది ఇంకో అరగంట ఉందని సమాచారం. ఇంత నిడివి ఉన్నా ఎక్కడా బోర్ కొట్టకుండా ప్రేక్షకులను మెప్పించగలిగాడు దర్శకుడు ఆదిత్య ధర్.

Also See : Vijay Deverakonda : పెళ్లి తర్వాత మొదటిసారి.. రష్మికతో కలిసి విజయ్.. ఫ్రెండ్ పెళ్ళిలో సందడి..

అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలను కలిపి దాదాపు ఏడు గంటల ముప్పై నిమిషాల నిడివితో ఒకే సినిమాగా రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారట. ఆల్రెడీ రెండు సినిమాలు కలిపి ఒకే సినిమాగా ఎడిటింగ్ కూడా పూర్తి చేసి సెన్సార్ కూడా చేయించారట. ప్రస్తుతం దురంధర్ పార్ట్ 2 థియేటర్స్ లో దూసుకుపోతుంది కాబట్టి కొన్ని రోజులు ఆగి ఈ రెండు సినిమాలను కలిపి ఒకే సినిమాగా రిలీజ్ చేయబోతున్నారని బాలీవుడ్ సమాచారం.

దీంతో ఏడున్నర గంటల సినిమానా అని ఆశ్చర్యపోతూనే రెండు సినిమాలు బాగున్నాయి కాబట్టి ఒకే సినిమాగా చూడటానికి ఆసక్తి చూపించే సినిమా లవర్స్ కూడా ఉన్నారు. మరి దురంధర్ ఫుల్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి. ఇక దురంధర్ సినిమా 1300 కోట్లు కలెక్ట్ చేయగా దురంధర్ పార్ట్ 2 ఇప్పటికే 1400 కోట్లు కలెక్ట్ చేసి 2000 కోట్లకు దూసుకుపోతుంది.