Allu Arjun : ‘పుష్ప 2’ ఫస్ట్ డే కలెక్షన్స్ పై అల్లు అర్జున్ ఫోకస్..!

పుష్ప-2 కలెక్షన్ల మీద ఫోకస్ పెట్టిన బన్నీ..ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ అదుర్స్‌ అనేలా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట.

Did Allu Arjun focus on Pushpa 2 first day collections

Allu Arjun : సినిమా చేశాం..కలెక్షన్లు వచ్చాయి..మూవీ హిట్‌ అయిపోయిందని కాదు..కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి. సక్సెస్ అంటే మామూలుగా ఉండొద్దు. గతంలో ఉన్న రికార్డులు అన్నీ బద్దలు అయిపోవాల్సిందేనంటున్నాడు అల్లుఅర్జున్. పుష్ప-2 కలెక్షన్ల మీద ఫోకస్ పెట్టిన బన్నీ..ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ అదుర్స్‌ అనేలా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట. డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్న పుష్ప-2 సినిమా కలెక్షన్స్..ఫస్ట్ రోజే బాహుబలి-2ని బీట్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నాడట అల్లుఅర్జున్‌.

కలెక్షన్లతో రికార్డు క్రియేట్ చేయాలనుకుంటున్న పుష్పరాజ్..మూవీ టికెట్‌ రేట్స్ పెంపు కోసం ప్రయత్నాలు చేస్తున్నాడట. పెద్ద స్టార్స్ పాన్ ఇండియా మూవీస్‌కు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రేట్స్ పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నాయి. అంతేకాదు రేట్ కూడా ఫిక్స్ చేస్తుంటాయి. ఫస్ట్ వన్ వీక్ ఒక రేట్, తర్వాత మరో రేట్ ఇలా ఫిక్స్ చేశారు.

Vidaa Muyarchi teaser : అజిత్ ‘విదాముయార్చి’ టీజ‌ర్ వ‌చ్చేసింది.. నో డైలాగ్స్‌.. యాక్ష‌న్‌, థ్రిల్లింగ్ సీన్స్ అదుర్స్‌..

ఇప్పటివరకు గుంటూరు కారం, కల్కి, దేవర లాంటి సినిమాలకు టికెట్ రేట్స్ 150 రూపాయల నుంచి 200 వరకు పెంచారు. పుష్ప-2 సినిమాకు మాత్రం మూడు రెట్లు పెంచుకోవడానికి పర్మిషన్ అడుగుతున్నారని టాక్. అంటే కల్కి సినిమా టికెట్‌ రేటు 200 రూపాయలకు పెంచితే, పుష్ప-2కు 300 రూపాయలన్న మాట. మహేశ్ ప్రభాస్, ఎన్టీఆర్‌ మూవీల కంటే మరో 25 శాతం టికెట్ రేట్స్ పెంచుకోవడానికి బన్నీ గట్టిగానే ట్రై చేస్తున్నాడట.

కలెక్షన్ల సునామీ సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్న ఐకాన్‌ స్టార్ బాహుబలి-2 ఫస్ట్ డే కలెక్షన్లను బెంచ్‌ మార్గ్‌గా పెట్టుకున్నాడట. బాహుబలి-2 ఫస్ట్ డే 200 కోట్ల ప్లస్ గ్రాస్ అయినట్లు లెక్కలు చెప్తున్నాయి. ఇప్పుడు పుష్ప-2 యూనిట్‌..250 కోట్ల గ్రాస్‌తో బాహుబలి-2 రికార్డ్‌ను దాటి పోవాలని ప్లాన్ చేస్తోందని అంటున్నాయి సినీ వర్గాలు.

Vijay Deverakonda – Allu Arjun : అల్లు అర్జున్ కి స్పెషల్ పుష్ప గిఫ్ట్ పంపించిన రౌడీ స్టార్.. నా స్వీటెస్ట్ బ్రదర్ అంటూ బన్నీ పోస్ట్..