Vijay Deverakonda – Allu Arjun : అల్లు అర్జున్ కి స్పెషల్ పుష్ప గిఫ్ట్ పంపించిన రౌడీ స్టార్.. నా స్వీటెస్ట్ బ్రదర్ అంటూ బన్నీ పోస్ట్..
విజయ్ దేవరకొండ అల్లు అర్జున్ కి స్పెషల్ గిఫ్ట్ పంపించాడు.

Vijay Deverakonda Sent Special Gift to Allu Arjun for Pushpa 2 Release
Vijay Deverakonda – Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 డిసెంబర్ 5న రిలీజ్ అవుతుండటంతో ఓ పక్కన మూవీ యూనిట్ ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉంది. మరో పక్క ఫ్యాన్స్ పుష్ప 2 సినిమా కోసం సంబరాలు చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. పలువురు సెలబ్రిటీస్ కూడా పుష్ప 2 సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ అల్లు అర్జున్ కి స్పెషల్ గిఫ్ట్ పంపించాడు.
Also Read : Malavika Mohanan : అల్లు అర్జున్, పుష్ప 2 సినిమాపై ప్రభాస్ హీరోయిన్ కామెంట్స్.. నేను ఆశ్చర్యపోయాను అంటూ..
రెగ్యులర్ గా అల్లు అర్జున్ కి విజయ్ దేవరకొండ తన రౌడీ బ్రాండ్ నుంచి డ్రెస్సెస్ పంపిస్తాడు. దీంతో అల్లు అర్జున్ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి థ్యాంక్స్ చెప్తాడు. ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ నేపథ్యంలో విజయ్ బన్నీకి రెండు టీ షర్ట్స్ గిఫ్ట్ గా పంపించాడు. ఒక దాని మీద కేవలం రౌడీ అని బ్రాండ్ నేమ్ ప్రింట్ ఉంటే మరోదానిపై రౌడీతో పాటు పుష్ప అని కూడా ప్రింట్ ఉంది. దీంతో ఈ రెండు టీ షర్ట్ ఫోటోలను అల్లు అర్జున్ తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. నా స్వీటెస్ట్ బ్రదర్ విజయ్ దేవరకొండ నీ ప్రేమకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసాడు.
దీంతో అల్లు అర్జున్ పోస్ట్ వైరల్ గా మారింది. ఇక విజయ్ ఫ్యాన్స్ కూడా బన్నీకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.
Thank You for your Love my sweet brotherrr … Vijay @TheDeverakonda
🖤🖤🖤 pic.twitter.com/gnHzoMPNUB— Allu Arjun (@alluarjun) November 28, 2024