Malavika Mohanan : అల్లు అర్జున్, పుష్ప 2 సినిమాపై ప్రభాస్ హీరోయిన్ కామెంట్స్.. నేను ఆశ్చర్యపోయాను అంటూ..
తాజాగా హీరోయిన్ మాళవిక మోహనన్ అల్లు అర్జున్, పుష్ప 2 సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Malavika Mohanan Interesting Comments on Allu Arjun and Pushpa 2 Movie
Malavika Mohanan : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులే కాదు సెలబ్రిటీలు సైతం ఎదురుచూస్తున్నారు. చాలా మంది సెలబ్రిటీలు ఇప్పటికే పుష్ప 2 సినిమా గురించి మాట్లాడారు. తాజాగా హీరోయిన్ మాళవిక మోహనన్ అల్లు అర్జున్, పుష్ప 2 సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. తమిళ్, మలయాళ సినిమాలతో స్టార్ డమ్ తెచ్చుకున్న మాళవిక మోహనన్ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ మరింత వైరల్ అయింది. ప్రస్తుతం మాళవిక ప్రభాస్ సరసన రాజాసాబ్ సినిమాలో నటిస్తుంది.
తాజాగా మాళవిక మోహనన్ ట్విట్టర్ లో అభిమానులు, నెటిజన్లతో ముచ్చటించింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ పుష్ప 2 గురించి మీరు ఎదురుచూస్తున్నారా నిజాయితీగా సమాధానం చెప్పండి అని అడిగాడు. దీనికి మాళవిక మోహనన్ సమాధానమిస్తూ.. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఎంత అద్భుతంగా నటించాడో చూసి నేను ఆశ్చర్యపోయాను. అతని స్వాగ్, స్టైల్, అతని డ్యాన్స్ అదిరిపోయాయి. పుష్ప 2 సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. ఇది తగ్గేదేలే సమయం అని పోస్ట్ చేసింది. దీంతో మాళవిక ట్వీట్ వైరల్ గా మారింది.
I was blown away by how fantastic Allu Arjun was in Pushpa. His swag, his style, his dance.. uff! Looking forward to #pushpa2 ! #Thaggedele time! 🔥 https://t.co/cLbjTrga7F
— Malavika Mohanan (@MalavikaM_) November 28, 2024