Pushpa 2 Event : బాలీవుడ్ రెడీగా ఉండు.. ‘పుష్ప’ వస్తున్నాడు.. ముంబైలో రేపే ఈవెంట్.. బాలీవుడ్ కళ్లన్నీ ఈ ఈవెంట్ మీదే..
ఇప్పుడు బాలీవుడ్ లో పుష్ప 2 ఈవెంట్ చేయబోతున్నారు.

Allu Arjun Pushpa 2 Movie Event in Bollywood Details Here
Pushpa 2 Event : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజ్ కి మరో ఆరు రోజులే ఉంది. డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉన్న అంచనాలు ఇంకా పెంచుతూ మూవీ యూనిట్ దేశంలోని పలు నగరాల్లో భారీ ఈవెంట్స్ చేస్తుంది. ఇప్పటికే పాట్నా, చెన్నై, కొచ్చిలలో పుష్ప 2 ఈవెంట్స్ చేసి గ్రాండ్ సక్సెస్ అయ్యారు మూవీ యూనిట్.
Also Read : Pushpa 2 : పుష్ప 2 సెన్సార్ పూర్తి.. ఏమేమి ఛేంజెస్ చేసారు? ఏ ఏ పదాలు మార్చారు..?
ఇప్పుడు బాలీవుడ్ లో పుష్ప 2 ఈవెంట్ చేయబోతున్నారు. పుష్ప ఐకానిక్ ప్రెస్ మీట్ పేరుతో రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి ముంబైలోని jw marriott sahar హోటల్ లో గ్రాండ్ గా చేయనున్నారు. ఇప్పటికే పాట్నా ఈవెంట్ తో బాలీవుడ్ కళ్లన్నీ పుష్ప 2 మీదే ఉన్నాయి. ఒక సౌత్ హీరో నార్త్ లో అది కూడా పాట్నాలో బహిరంగ ఈవెంట్ అంత భారీగా చేసి సక్సెస్ అవ్వడంతో కొంతమంది బాలీవుడ్ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అని సమాచారం.
ఇక రేపు బాలీవుడ్ అడ్డా అయిన ముంబైలో పుష్ప 2 ఈవెంట్ చేస్తుండటంతో బాలీవుడ్ స్టార్స్ కూడా ఈ ఈవెంట్ ఎలా జరుగుతుందో అని ఎదురుచూస్తున్నారు. పుష్ప 1 సినిమా బాలీవుడ్ లో పెద్ద హిట్ అయింది. దీంతో పుష్ప 2 పై కూడా అక్కడ భారీ అంచనాలే ఉన్నాయి. మరి రేపు ముంబై ఈవెంట్ ఏ లెవల్లో జరుగుతుందో చూడాలి.
Mumbai meri jaan, aa raha hain Indian Cinema ki shaan 🔥🔥#PushpaIconicPressMeet in Mumbai tomorrow from 2 PM onwards at JW Marriott Sahar ❤️🔥
▶️ https://t.co/Pk4R18O17V#Pushpa2TheRule#Pushpa2TheRuleOnDec5th
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil… pic.twitter.com/4gzZTnQ74e
— Pushpa (@PushpaMovie) November 28, 2024