Pushpa 2 : పుష్ప 2 సెన్సార్ పూర్తి.. ఏమేమి ఛేంజెస్ చేసారు? ఏ ఏ పదాలు మార్చారు..?
పుష్ప 2 సెన్సార్ సర్టిఫికెట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Allu Arjun Pushpa 2 Censor Certificate goes Viral Here Censor Changing Details
Pushpa 2 : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక మూవీ యూనిట్ కూడా వరుసగా భారీ ఈవెంట్స్ చేస్తూ దేశమంతా పుష్ప 2 పై హైప్ పెంచుతుంది. మరో 6 రోజుల్లోనే సినిమా రిలీజ్ ఉండటంతో ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. తాజాగా నేడు పుష్ప 2 సినిమా సెన్సార్ పూర్తి అయింది.
పుష్ప 2 సెన్సార్ సర్టిఫికెట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో మొత్తం 5 ఛేంజెస్ చెప్పి పుష్ప 2 సినిమాకు U/A సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ అయిదు ఛేంజెస్.. రండీ అనే పదం దగ్గర లపాకి అని మార్పించారు. ఒక భూతు పదం వాడటంతో దాన్ని మ్యూట్ చేసారు. వెంకటేశ్వర స్వామి పదం వద్ద భగవంతుడు అని మార్పించారు. అలాగే గాలిలో కాలు నరికే దృశ్యాన్ని, నరికిన చెయ్యి పట్టుకున్న విజువల్ కనిపించకుండా చేయించారు. ఈ ఛేంజెస్ కు మూవీ టీమ్ ఒప్పుకుంది.

ఇక పుష్ప 2 రన్ టైం మొత్తం 3 గంటల 20 నిమిషాలు. సెన్సార్ వాళ్ళు కూడా సినిమా అదిరిపోయిందని చెప్పినట్టు తెలుస్తుంది. వరల్డ్ వైడ్ గ్రాండ్ గా 12000 థియేటర్స్ లో రిలీజ్ అవ్వడానికి రెడీ ఉంది పుష్ప 2 సినిమా. మరి ఈ సినిమా ఎన్ని రికార్డులని బద్దలు కొడుతుందో చూడాలి.
𝐔/𝐀 it is!! #Pushpa2TheRuleOnDec5th pic.twitter.com/jPZuMaRK56
— Allu Arjun (@alluarjun) November 28, 2024