Director Subbu : నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని.. హిందూ అని గర్వంగా చెప్పుకుంటాను.. ఆ వివాదంపై డైరెక్టర్ వ్యాఖ్యలు..
తాజాగా నేడు జరిగిన టీజర్ లాంచ్ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ సుబ్బుకు ఈ వివాదంపై ప్రశ్న ఎదురైంది.

Director Subbu gives Clarity on Bachhala Malli Issue and says about Pawan Kalyan
Director Subbu : అల్లరి నరేష్, అమృత అయ్యర్ జంటగా సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘బచ్చలమల్లి’. ఈ సినిమా టీజర్ నేడు రిలీజ్ అయింది. దీనికి సంబంధించి ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. అయితే గతంలో బచ్చలమల్లి గ్లింప్స్ రిలీజ్ అయినప్పుడు.. అందులో మైక్ లో భగవద్గీత వస్తుంటే అల్లరి నరేష్ దాన్ని పీకి కింద పడేస్తాడు. దీంతో ఆ గ్లింప్స్ వివాదంగా మారింది. పలు హిందూ సంఘాలు దీనిపై విమర్శలు చేసారు. దర్శకుడిని కూడా విమర్శించారు.
Also Read : Game Changer Song : ‘గేమ్ ఛేంజర్’ మూడో సాంగ్ వచ్చేసింది.. ‘నానా హైరానా..’ మెలోడీ పాట అదిరిందిగా..
తాజాగా నేడు జరిగిన టీజర్ లాంచ్ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ సుబ్బుకు ఈ వివాదంపై ప్రశ్న ఎదురైంది. దీనికి సుబ్బు సమాధానమిస్తూ.. నన్ను విమర్శిస్తూ ట్విట్టర్లో, కామెంట్స్ లో తిట్టారు. వాళ్లంతా బచ్చలమల్లి క్యారెక్టర్ లాగే మూర్ఖులు. సినిమా చూడకుండానే టీజర్ చూసి నన్ను అలా కామెంట్ చేసారు. వాళ్ళే సినిమా చూసాక నాకు సారీ చెప్తారు. అయినా ఆ ఇష్యూ సాల్వ్ అయిపొయింది. నేను హిందూని. నా కల్చర్ అంటే నాకు ఇష్టం. నేను పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్ ని. ఆయనే సనాతన ధర్మం గురించి అంత గొప్పగా చెప్తుంటే నేను ఆయన ఫ్యాన్ ని ఆయన చెప్తే నేను విననా. నేను అన్ని దేవాలయాలకు వెళ్లి దర్శనం చేసుకుంటాను. నేను నా ధర్మానికి, నా దేవుళ్ళకు, నా పద్ధతులకు రెస్పెక్ట్ ఇస్తాను. నేను హిందూ అని గర్వంగా చెప్పుకుంటాను అని అన్నారు. దీంతో సుబ్బు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.