Jhansi Daughter : నటి, యాంకర్ ఝాన్సీ కూతుర్ని చూశారా..? ఇంత మంచి డ్యాన్సరా..? సినిమాల్లోకి ఎంట్రీ..?

నేడు తన కూతురు ధన్య 22వ పుట్టిన రోజు కావడంతో తనతో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసింది ఝాన్సీ.

Jhansi Daughter : నటి, యాంకర్ ఝాన్సీ కూతుర్ని చూశారా..? ఇంత మంచి డ్యాన్సరా..? సినిమాల్లోకి ఎంట్రీ..?

Did you know about Anchor Jhansi Daughter Jhansi shares a special post on her Daughter Dhanya

Updated On : November 5, 2024 / 9:04 PM IST

Jhansi Daughter : యాంకర్ గా, నటిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఝాన్సీ. ఇటీవల రెగ్యులర్ గా సినిమాలతో బిజీగా ఉంది. ఝాన్సీ ఎప్పుడో కొన్నేళ్ల క్రితమే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆమెకు ఒక కూతురు ఉంది. ఝాన్సీ కూతురు పేరు ధన్య. చాలా రేర్ గా తన కూతురుతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది ఝాన్సీ. అయితే తాజాగా తన కూతురి గురించి చెప్తూ ఝాన్సీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది.

Also Read : Suriya : థియేటర్ల వివాదం.. సూర్యను సూటి ప్రశ్న అడిగిన కన్నడ జర్నలిస్ట్.. సూర్య ఏమన్నాడంటే..

నేడు తన కూతురు ధన్య 22వ పుట్టిన రోజు కావడంతో తనతో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసింది ఝాన్సీ. ఈ ఫోటో షేర్ చేసి.. పేరెంట్ గా ఉండటం గొప్ప అనుభవం. ఈ పేరెంట్ – చైల్డ్ బంధంపై గర్వంగా ఉంది. మేము ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా వాటిని ఎదుర్కొని నిలబడ్డాము. అది ఈ అమ్మాయి వల్లే సాధ్యమైంది. ఈమెను పెంచడంలో పాత్ర పోషించిన వ్యక్తులందరికి కృతజ్ఞతలు. ఇప్పుడు ఈమెకు 22 ఏళ్ళు. ఈమె ఒక్కోసారి నాకు పేరెంట్ లా వ్యవహరిస్తుంది. తను ప్రపంచాన్ని రూల్ చేయడానికి సిద్ధంగా ఉంది. నీ ప్రతి కల నెరవేరాలి అంటూ బర్త్ డే విషెస్ చెప్పింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

Did you know about Anchor Jhansi Daughter Jhansi shares a special post on her Daughter Dhanya

అలాగే ఝాన్సీ తన కూతురు సోషల్ మీడియా అకౌంట్ ని కూడా ట్యాగ్ చేసింది. ఇన్నాళ్లు దాచిన కూతుర్ని ఇప్పుడు అందరికి పరిచయం చేస్తూ తన సోషల్ మీడియా అకౌంట్ కూడా పెట్టడంతో తను కూడా సిని పరిశ్రమలోకి వస్తుందా, తను కూడా కాబోయే సెలబ్రిటీనా అని సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. ఇక ఝాన్సీ కూతురు ధన్య డ్యాన్సర్ అని తెలుస్తుంది. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో ధన్య డ్యాన్సర్ అని పెట్టుకుంది. అలాగే తను డ్యాన్స్ చేసిన పలు రీల్స్ షేర్ చేసింది. ఆ రీల్స్ లో ధన్య డ్యాన్స్ అదరగొట్టేసింది. దీంతో ఝాన్సీ కూతురు ధన్య మంచి డ్యాన్సర్ అని తెలుస్తుంది. మరి సినీ పరిశ్రమలోకి వస్తుందా? నటి అవుతుందా ? లేక డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ అవుతుందా చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Michael Tej Raj 🇮🇳 (@scarface.j1)