Suriya : థియేటర్ల వివాదం.. సూర్యను సూటి ప్రశ్న అడిగిన కన్నడ జర్నలిస్ట్.. సూర్య ఏమన్నాడంటే..

తెలుగుకే కాదు తమిళ్ కాకుండా తమిళనాడులో వేరే భాషల సినిమాలకు థియేటర్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు.

Suriya : థియేటర్ల వివాదం.. సూర్యను సూటి ప్రశ్న అడిగిన కన్నడ జర్నలిస్ట్.. సూర్య ఏమన్నాడంటే..

Suriya Faced Tamil Theaters Issue Question from Kannada Journalist

Updated On : November 5, 2024 / 8:15 PM IST

Suriya : ఇటీవల తమిళనాడులో తెలుగు సినిమాలకు థియేటర్స్ ఇవ్వట్లేదు అనే వివాదం పెద్దదవుతుంది. మనం తమిళ్ వాళ్ళను అక్కున చేర్చుకొని వాళ్లకు భారీగా ఇక్కడ థియేటర్లు ఇస్తూ వాళ్ళ సినిమాలను హిట్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నాము. కానీ మన తెలుగు సినిమాలకు మినిమమ్ థియేటర్స్ కూడా ఇవ్వట్లేదు. ఇటీవల కిరణ్ సబ్బవరం క సినిమాకు కనీసం 5 థియేటర్లు అడిగినా ఇవ్వలేదు.

మన తెలుగుకే కాదు తమిళ్ కాకుండా తమిళనాడులో వేరే భాషల సినిమాలకు థియేటర్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. కానీ తమిళ్ సిన్మాలు మాత్రం అన్ని చోట్ల భారీగా రిలీజ్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ వివాదం సాగుతుంది. అయితే ప్రస్తుతం సూర్య కంగువ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బెంగుళూరు వెళ్లారు. అక్కడ సినీ జర్నలిస్ట్ లతో మాట్లాడారు.

Also Read : Game Changer : గేమ్ ఛేంజర్ నుంచి వరుస అప్డేట్స్ ఇచ్చిన దిల్ రాజు.. ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడే..

ఈ సందర్భంగా ఓ కన్నడ జర్నలిస్ట్.. మా దగ్గర మీ తమిళ్ సినిమాలకు వందల స్క్రీన్స్ ఇస్తున్నారు. మీ తమిళనాడులో కూడా కన్నడ సినిమాకు ఇన్ని థియేటర్స్ ఇస్తామని గ్యారెంటీ ఇవ్వగలరా అంటూ త్వరలో రాబోయే ఓ హీరో సినిమా పేరు చెప్పి దానికి అన్ని థియేటర్స్ ఇస్తారా అని ప్రశ్నించారు. మొదట దీనికి సూర్య ఖంగుతిన్నా ఆ తర్వాత దీనికి సమాధానమిస్తూ.. నేను డిస్ట్రిబ్యూటర్స్ సర్కిల్ లో లేను. ఒకవేళ నన్ను ఎవరైనా దానికి సంబంధించి జరిగే మీటింగ్ పిలిస్తే నేను కచ్చితంగా మాట్లాడతాను. నా వంతు అయింది నేను చేస్తాను అది జరగడానికి. కానీ మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ అది వేరే ప్రపంచం, థియేటర్స్ ఓనర్స్, డిస్ట్రిబ్యూటర్స్ చూసుకుంటారు. ఒకవేళ నా చేతిలో ఉంటే నేను ఏదైనా చేస్తాను అని అన్నారు. ఇలా స్టార్ హీరోకు డైరెక్ట్ గా థియేటర్స్ వివాదం గురించి వేరే పరిశ్రమలో ప్రశ్న ఎదురయ్యాక కూడా తమిళనాడులో వేరే భాష సినిమాలకు థియేటర్స్ ఇవ్వకుండా ఇంకా ఇబ్బంది పెడతారా చూడాలి మరి.