Allu Arjun : అల్లు అర్జున్ కొత్త థ‌మ్స‌ప్ యాడ్ చూశారా?

అల్లు అర్జున్ నటించిన థ‌మ్స‌ప్ కొత్త యాడ్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Did you watch Icon Star Allu Arjun new thums up advertisement

మ‌న హీరోలు మూవీస్ మాత్ర‌మే కాకుండా యాడ్స్‌, బిజినెస్‌లు కూడా చేస్తూ ఉంటారు అన్న సంగ‌తి తెలిసిందే. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ థ‌మ్స‌ప్‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న థ‌మ్స‌ప్ కొత్త యాడ్‌లో న‌టించారు. ఈ కొత్త యాడ్ ను థ‌మ్స‌ప్ త‌మ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.

సిచ్యువేష‌న్ ఎలాంటిది అయినా ఒక్క సిప్ చేయ్‌.. అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. మొత్తంగా ఈ యాడ్ ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌స్తుతం ఈ యాడ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Thaman : హీరోగా నటించనున్న తమన్‌?


కాగా.. గ‌తంలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, విజ‌య్ దేవ‌ర‌కొండ వంటి స్టార్లు థ‌మ్స‌ప్ కు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్య‌వ‌హ‌రించిన సంగ‌తి తెలిసిందే.

ఇక అల్లు అర్జున్ విష‌యానికి వ‌స్తే.. ఇటీవ‌ల ఆయ‌న పుష్ప 2 చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చారు. గ‌తేడాది డిసెంబ‌ర్ 4న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం థియేట‌ర్ల వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించింది. బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. రూ.1850 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ విష‌యాన్ని ఇప్ప‌టికే చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. బాహుబ‌లి 2 రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు వెల్ల‌డించింది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో ర‌ష్మిక క‌థానాయికగా న‌టించింది. సునీల్, ఫ‌హ‌ద్ ఫాజిల్‌, అన‌సూయ‌లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

Thandel Pre release event : తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. నాగ‌చైత‌న్య కోసం వ‌స్తున్న స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ త్వ‌ర‌లోనే ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌లో ఓ సినిమాలో న‌టించ‌నున్నాడు. భారీ బ‌డ్జెట్‌తో మైథ‌లాజిక‌ల్ స‌బ్జెక్టుతో ఈ చిత్రం తెర‌కెక్క‌నున్న‌ట్లుగా తెలుస్తోంది. గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన చిత్రాలు జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, అల వైకుంఠపురంలో ఘ‌న విజ‌యాన్ని సాధించిన సంగ‌తి తెలిసిందే. దీంతో రాబోయే చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.