Thandel Pre release event : తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. నాగ‌చైత‌న్య కోసం వ‌స్తున్న స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

శనివారం తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌ర‌గ‌నుంది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఓ స్టార్ హీరో వ‌స్తున్నారు.

Thandel Pre release event : తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. నాగ‌చైత‌న్య కోసం వ‌స్తున్న స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

Allu Arjun chief guest for Thandel Pre release event

Updated On : January 31, 2025 / 6:51 PM IST

అక్కినేని నాగ చైత‌న్య న‌టిస్తున్న మూవీ తండేల్‌. చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి క‌థానాయిక‌గా న‌టిస్తోంది. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై బ‌న్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 7న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌, పాటలు, టీజర్‌, ట్రైల‌ర్ లు సినీ ప్రియుల‌ను ఎంతో ఆక‌ట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్ర ప్రీ రీలీజ్ ఈవెంట్‌కు డేట్ ఫిక్సైంది.

మత్స్యకార బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ శ‌నివారం (ఫిబ్ర‌వ‌రి 1) హైద‌రాబాద్‌లో ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రానున్నారు. ఈ విష‌యాన్ని చిత్ర బృందం తెలియ‌జేసింది.

Vishwambhara : చిరంజీవి విశ్వంభర VFX టీమ్ మారిందా? ఆ సెక్షన్ కి డైరెక్టర్ కూడా మారాడా?

‘పుష్పరాజ్ ఫర్ తండేల్‌ రాజ్‌..’ తండేల్ జాతర వ‌స్తున్నాడు అంటూ ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. దీంతో చైత‌న్య అభిమానులతో పాటు బ‌న్నీ అభిమానులు ఈఈవెంట్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

Laila : కొయ్ కొయ్.. కోడ్ని కొయ్.. విష్వక్ సేన్ లైలా సినిమాలో కుమ్మేశాడుగా..

శ్రీకాకుళం మత్స్యకార కుటుంబంలో జ‌రిగిన ఓ య‌థార్థ కథ అధారంగా ఈ సినిమా తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్‌లోనే తెర‌కెక్కించారు. యాక్షన్ సీన్స్ కూడా భారీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఓ జాల‌రి పొర‌బాటున పాక్ జ‌లాల్లోకి ప్ర‌వేశించాడు. దీంతో అత‌డిని పాక్ నేవి అధికారులు అరెస్ట్ చేస్తారు. దీని ఆధారంగా తండేల్ చిత్రాన్ని నిర్మించిన‌ట్లుగా తెలుస్తోంది.