Thaman : హీరోగా నటించనున్న తమన్‌?

మ్యూజిక్ డైరెక్ట‌ర్ తమన్‌ ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు.

Thaman : హీరోగా నటించనున్న తమన్‌?

Music Director Thaman

Updated On : January 31, 2025 / 9:26 PM IST

మ్యూజిక్ సెన్సేషన్‌..తమన్‌ ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. తనదైన మ్యూజిక్‌తో ఎన్నో సినిమాలకు సంగీతాన్ని అందించాడు. రీసెంట్‌గా తమన్ గేమ్‌ఛేంజర్‌, డాకు మహారాజ్ వంటి సినిమాలకు ఆల్బమ్స్ ఇచ్చాడు. ముఖ్యంగా బాలకృష్ణ హీరోగా చేసిన డాకు మహారాజ్ సినిమాకు తమన్‌ అందించిన బీజీఎంతో థియేటర్లు దద్దరిల్లాయి. ఇలా మ్యూజిక్‌ డైరెక్టర్‌గా అదరగొడుతున్న తమన్‌ను త్వరలోనే ఓ కొత్త రోల్‌లో చూడబోతున్నామన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆయన ఓ సినిమాలో హీరోగా నటించబోతున్నారట. అది కూడా తమిళంలో ఈ సినిమా తెరకెక్కనుందని టాక్‌. కోలీవుడ్ స్టార్ హీరో అథర్వతో కలిసి తమన్ మల్టీస్టారర్ సినిమా చేయనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ మాత్రం చేయడం లేదట.

Laila : కొయ్ కొయ్.. కోడ్ని కొయ్.. విష్వక్ సేన్ లైలా సినిమాలో కుమ్మేశాడుగా..

మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కు బిగ్ స్క్రీన్‌పై కనిపించడం ఇదేం కొత్త కాదు. సంగీతం దర్శకుడు కాక ముందు తమన్ దాదాపు 900 సినిమాలకు డ్రమ్మర్‌గా పనిచేశాడు. తర్వాత శంకర్ సినిమా బాయ్స్‌లో డ్రమ్స్‌ వాయించే బాయ్‌గా నటించాడు.

మిస్టర్ మజ్ను, బేబి జాన్ లాంటి సినిమాల్లోనూ కనిపించాడు. అయితే గతంలో దేవీశ్రీ ప్రసాద్ హీరోగా ఎంట్రీ అంటూ ప్రచారం జరిగింది. కానీ అది జరగలేదు. మరి తమన్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. తమన్ హీరో అయితే మ్యూజిక్‌కు పుల్ స్టాప్ పెడతాడా.? లేక రెండు కంటిన్యూ చేస్తాడా అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

Thandel Pre release event : తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. నాగ‌చైత‌న్య కోసం వ‌స్తున్న స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

వరుస సినిమాలతో బిజీబిజీగా గడిపేస్తున్నాడు తమన్. ఆయన చేతిలో ప్రభాస్- మారుతి కాంబోలో తెరకెక్కుతున్న రాజాసాబ్, పవన్ కల్యాణ్- ఓజీ, బాలకృష్ణ-అఖండ-2లాంటి బడా ప్రాజెక్టులు ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని సినిమాలకు కూడా తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్‌లో హీరోగా నటించేందుకు తమన్‌కు టైమ్‌ సెట్‌ అవుతుందా అనేది కూడా ఇంకో చర్చ. నిజంగానే హీరోగా నటించబోతున్నాడా లేదా జస్ట్ రూమరేనా అనేది ఆయన చెప్తేనే క్లారిటీ రానుంది.