Diehard fan of singer Kumar Sanu
Singer Kumar Sanu’s fan cycles 1200 km : అభిమానం ఎంత పని అయినా చేయిస్తుంది. అభిమానించే వారిని కలుసుకునేందుకు కొందరు ఎంతదూరం అయినా వెళతారు. తాను ఎంతగానో ఆరాధించే ఓ సింగర్‌ను కలుసుకునేందుకు ఓ వ్యక్తి ఏకంగా 1200 కి.మీ దూరం ప్రయాణించాడు. ఇందులో ఏముంది అని అంటారా..? విమానాలు, రైళ్లు, బస్సులు అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో అది ఏమీ పెద్ద విషయం కాదంటారా..? అక్కడికే వస్తున్నాం ఆగండి.. అతడు వీటిలో దేంట్లోనూ ప్రయాణించలేదు. కేవలం సైకిల్ తొక్కుకుంటూ తన స్వగ్రామం నుంచి గాయకుడి ఇంటికి వచ్చాడు.
ఆ వ్యక్తి పేరు రాకేష్ బలోదియా(Rakesh Balodiya). అతడు అంతగా అభిమానించేది గాయకుడు కుమార్ సాను(Singer Kumar Sanu). రాజస్థాన్‌లోని జుంఝుకు చెందిన రాకేష్‌కు సింగర్ కుమార్ సాను అంటే ఎంతో ఇష్టం. అతడిని నేరుగా కలవాలని బావించాడు. కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పగా వారు అతడికి మద్దతుగా నిలిచారు. దీంతో ఇంకేం ఆలోచించకుండా అతడు సైకిల్ పై స్వగ్రామమైన జుంఝు నుంచి ముంబైకి దాదాపు 1200కి.మీ దూరం సైకిల్ తొక్కుకుంటూ వచ్చాడు.
Suriya : బాలీవుడ్ దర్శకుడితో సూర్య 600 కోట్ల భారీ బడ్జెట్ మూవీ.. టైటిల్ ‘కర్ణ’.. కర్ణుడి కథేనా..?
ఈ విషయం తెలుసుకున్న సింగర్ కుమార్ సాను అతడిని ఆప్యాయంగా పలకరించి కౌగిలించుకున్నాడు. అతడితో కాసేపు మాట్లాడాడు. రాకేష్ కూడా సానుకి బొకే అందించాడు. అనంతరం రాకేష్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం తనకు మాటలు రావడం లేదన్నాడు. తాను ఎంత సంతోషంగా ఉన్నాయో చెప్పడానికి పదాలు దొరకడం లేదన్నాడు. 12వ తరగతి చదువుతున్నప్పటి నుంచి కుమార్ సాను పాటలు వినడం మొదలుపెట్టానని, అతడి నుంచి తన స్టైల్‌ను పొందినట్లు చెప్పాడు.
Diehard fan of singer Kumar Sanu
దాని వల్ల నగరంలో తనకు పేరు వచ్చిందని, ఆ ప్రేమే తనను ఇక్కడి వరకు లాక్కొచ్చిందని తెలిపాడు. అభిమాన సింగర్‌ను కలుసుకోవాలని వెలుతున్నానని చెప్పగానే కుటుంబంతో పాటు ప్రతీ ఒక్కరు తనకు మద్దతు ఇచ్చినట్లు వెల్లడించాడు. ఎందుకంటే తాను సింగర్‌ను ఎంతగా అభిమానిస్తున్నానో వారందరికీ తెలుసునని చెప్పుకొచ్చాడు.
అనంతరం కుమార్ సాను మీడియాతో మాట్లాడుతూ.. ‘అభిమానులు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తారు. ఇది చాలా బాగుంది. నన్ను కలిసేందుకు రాకేష్ 1200 కి.మీ సైకిల్ తొక్కుకుంటూ వచ్చాడు. అందుకే అతడిని నేను కౌగిలించుకున్నాను. అది నన్ను ఎంతో భావోద్వేగానికి గురి చేసింది. అంత దూరం నుంచి సైకిల్ తొక్కుతూ వస్తున్నాడని తెలిసి మొదట్లో ఆశ్చర్య పోయా. దారిలో ఏదైన జరిగితే అని ఆందోళన చెందాను. అయితే.. ఈ రోజు అతడిని చూడగానే నాకు చాలా ఉపశమనం కలిగింది. ఇది చాలా బాగుంది.’ అని అన్నారు.