Krishna : బుర్రిపాలెంలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కుటుంబ సభ్యులు.. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు..!

సూపర్ స్టార్ కృష్ణ సొంతగ్రామం బుర్రిపాలెంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు..

Krishna : బుర్రిపాలెంలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కుటుంబ సభ్యులు.. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు..!

Super Star Krishna statue is opened at his village Burri Palem Mahesh Babu Sudheer Babu

Krishna : సూపర్ స్టార్ కృష్ణ గురించి తెలుగు ఆడియన్స్ కి సపరేట్ గా చెప్పనవసరం లేదు. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా తన డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణయాలతో తెలుగు వారిమదిలో నిజమైన హీరోలా మిగిలిపోయారు. అలాంటి ఆయన చనిపోయిన వార్త చాలామందిని ఎంతో బాధించింది. అయితే తన సినిమాలతో మాత్రం తెలుగు సినిమా చరిత్రలో పదిలంగా ఉండిపోతారు. కాగా కృష్ణ గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో జన్మించారు. అక్కడి నుంచి సినిమాల్లో సూపర్ స్టార్ గా ఎదిగారు.

Tollywood Best Friends : సినిమా కలిపిన బంధం.. సెలబ్రిటీల మధ్య స్నేహ బంధం .. టాలీవుడ్ బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్లే

కృష్ణకి బుర్రిపాలెం అంటే ఎంతో ఇష్టం. ఆయనకి మాత్రమే కాదు అక్కడి వారు కూడా కృష్ణని ఎంతో అభిమానిస్తుంటారు. ఆ అభిమానంతోనే తాజాగా ఆ గ్రామంలో కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇక విగ్రహ ఆవిష్కరణ కృష్ణ కుటుంబ సభ్యులు చేతులు మీదుగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి మెరుగు నాగార్జున, ఎమ్మెల్యే శివకుమార్, మాజి మహిళా కమిషన్ ఛైర్ పెర్సన్ నన్నపనేని రాజకుమారి, దర్శకుడు కృష్ణా రెడ్డి, కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు, హీరో సుదీర్ బాబు (Sudheer Babu) దంపతులు, కృష్ణ కూతుర్లు మంజుల-పద్మావతి, ఘట్టమనేని కృష్ణ కుటుంబ సభ్యులు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Samantha : మయోసైటిస్ చికిత్స కోసం 25 కోట్లు ఖర్చుపెడుతున్న సమంత.. నిజమేనా..?

ఈ కార్యక్రమంలో కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ..

బుర్రిపాలెం పేరు ఎత్తకుండా కృష్ణ ఏ విషయం మాట్లాడేవారు కాదు. ఇక్కడ ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అవి ఇక ముందు కూడా కొనసాగుతూనే ఉంటాయి. కృష్ణ పేరు ఎప్పటికి గుర్తుండిపోయే విధంగా మంచి కార్యక్రమాలు చేపడతాం. గ్రామానికి ఏదైనా అవసరం ఉంటే, తమ దృష్టికి తీసుకు వస్తే మా కుటుంబం తరుపున కచ్చితంగా చేస్తాము. ఇక్కడ ఉన్న కృష్ణ జ్ఞాపకాలను పదిలంగా ఉంచేలా కుటుంబ సభ్యులందరం చేసుకుంటాము. ఇక మహేష్ బాబు ఇప్పుడు రాలేకపోయాడు. మరోసారి కచ్చితంగా ఈ గ్రామానికి వస్తానని చెప్పాడు.

సుధీర్ బాబు మాట్లాడుతూ..

సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయన సినిమాలతో పాన్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ గా ఎదిగారు. ఆయన ఆశలు, సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకు వెళ్లాల్సిన భాద్యత మాపై, మా పిల్లల పై ఉంది. నేను ఎప్పుడు బాధలో ఉన్నా కృష్ణ గారి చిత్ర పటాన్ని చూస్తే చాలు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఇప్పుడు ఈ విగ్రహాన్ని చూస్తే ఆయన ఇక్కడే సజీవంగా ఉన్నట్లు ఉంది. కృష్ణ గారు ఆయన తమ్ముడు ఆదిశేషగిరిరావులా మా పిల్లలు కూడా మంచి అనుబంధంలా కలిగి ఉండాలని కోరుకుంటున్నాను.

కృష్ణ కూతుళ్లు మంజుల, పద్మావతి మాట్లాడుతూ..

కృష్ణ గారు బుర్రిపాలెం ఒక రైతు కుటుంబం నుంచి సినీ పరిశ్రమకి వెళ్లి బుర్రిపాలెం బుల్లోడుగా కోట్లాటిమంది ప్రేక్షకుల ప్రేమను పొందారని, ఆయనకి ఈ గ్రామం పై ఎంతో ప్రేమ ఉండేదని, ఈ గ్రామంలోనే ప్రతి జ్ఞాపకం గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవారని, అలాంటిది ఇప్పుడు ఇక్కడ కృష్ణ గారి విగ్రహం ఏర్పాటు చేయడం ఆనందదాయకంగా ఉందంటూ పేర్కొన్నారు.