Dil Raju About Resuming Shootings In Tollywood: టాలీవుడ్‌లో షూటింగ్‌ల ప్రారంభంపై దిల్ రాజు కామెంట్స్

టాలీవుడ్‌లో షూటింగ్స్‌ను ఆగస్టు 1 నుండి నిలిపివేసిన సంగతి తెలిసిందే. సినిమా టికెట్ రేట్లు, ఓటీటీ రిలీజ్‌లు తదితర విషయాలపై ఫిలిం చాంబర్‌లో నిర్మాతలు పలు దఫాలుగా చర్చలు జరుపుతున్నారు. తాజాగా గురువారం నాడు మరోసారి నిర్మాతలు సమావేశం అయ్యారు. ఈ క్రమంలో వారు చర్చించిన అంశాలను ప్రముఖ నిర్మాత దిల్ రాజు మీడియాకు తెలిపారు.

Dil Raju About Resuming Shootings In Tollywood: టాలీవుడ్‌లో షూటింగ్స్‌ను ఆగస్టు 1 నుండి నిలిపివేసిన సంగతి తెలిసిందే. సినిమా టికెట్ రేట్లు, ఓటీటీ రిలీజ్‌లు తదితర విషయాలపై ఫిలిం చాంబర్‌లో నిర్మాతలు పలు దఫాలుగా చర్చలు జరుపుతున్నారు. తాజాగా గురువారం నాడు మరోసారి నిర్మాతలు సమావేశం అయ్యారు. ఈ క్రమంలో వారు చర్చించిన అంశాలను ప్రముఖ నిర్మాత దిల్ రాజు మీడియాకు తెలిపారు.

Telugu Film Industry Strike: ఫిలిం ఛాంబర్‌లో నిర్మాతల సమావేశం.. షూటింగ్ ఆపేదే లేదు!

దిల్ రాజు మాట్లాడుతూ.. ఆగస్టు 1 నుంచి షూటింగ్‌లు అపేసి కమిటీలు వేసుకున్నామని.. నిర్మాతలుగా మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని.. 8 వారాల తరువాత ఓటీటీలోకి సినిమా ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇక టికెట్ రేట్ల గురించి కూడా ఓ నిర్ణయం తీసుకున్నామని.. థియాటర్‌లు, మిల్టీప్లెక్సులతో మాట్లాడామని ఆయన అన్నారు. సినిమా అభిమానులకి టికెట్ రేట్లు తగ్గించి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లుగా దిల్ రాజు తెలిపారు.

Telugu Film Chamber : తెలుగు ఫిలిం చాంబర్ మాత్రమే డెసిషన్ మేకర్

ఇక సినిమాలో ఎందుకు వృధా కర్చు అవుతుంది అని మాట్లాడుతున్నామని.. 3, 4 రోజుల్లో ఫైనల్ మీటింగ్స్ ఉంటాయని.. మీటింగ్ అయ్యాక ఫైనల్ నిర్ణయం ఉంటుందని.. అయితే షూటింగ్‌లు ఎప్పుడు ప్రారంభం కావాలి అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ గౌరవించారని దిల్ రాజు పేర్కొన్నారు. ఇక బాలీవుడ్ తెలుగు పరిశ్రమపై ఒక కన్నేసి ఉందని.. ఇక్కడ షూటింగ్‌లు ఆపేసి ఏం చేస్తున్నామని వారు ఆతృతగా చూస్తున్నారని దిల్ రాజు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు