Dil Raju : దాదా సాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ ఈవెంట్‌కి గెస్ట్‌గా దిల్ రాజు..

నటన, దర్శకత్వం, ఛాయాగ్రహణం, ఎడిటింగ్ వంటి పలు విభాగాల్లో పలువురిని సుశిక్షితుల్ని చేస్తూ, సినిమా రంగానికి అందిస్తూ వస్తున్న 'దాదా సాహెబ్ ఫాల్కే ఆఫ్ ఫిల్మ్ స్టడీస్' స్కూల్ ఆరవ స్నాతకోత్సవం జరుపుకుంది. నిర్మాత దిల్ రాజు..

Dil Raju Chief guest for Dadasaheb Phalke School Of Film Studies

Dadasaheb Phalke School Of Film Studies : ఒకప్పుడు సినిమా రంగం గురించి ఒక తప్పు అభిప్రాయం ఉండేది. ఏమి చేతకాక సినిమా వైపు వెళ్లారనే భావన ఉండేది. కానీ ఇప్పుడు ఆ అభిప్రాయం మారుతుంది. సినిమా రంగం కూడా ఒక విద్యగా మారుతుండడంతో.. నేటి యువత సినిమాని కూడా ఒక ప్రొఫెషన్ గా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా పరిశ్రమ కూడా ప్రస్తుతం ఉపాధి వేదికగా వృద్ధి చెందుతుంది. ఇక సినిమా రంగంలోని 24 క్రాఫ్ట్స్ పై అవగాహన కలిపించేలా పలు స్కూల్స్ ఇప్పటికే ఏర్పడ్డాయి.

Sudheer Babu : మా నాన్న సూపర్ హీరో అంటున్న సుధీర్ బాబు.. కోటి రూపాయిల లాటరి టికెట్!

అలా అందుబాటులోకి వచ్చిన స్కూల్ “దాదా సాహెబ్ ఫాల్కే ఆఫ్ ఫిల్మ్ స్టడీస్”. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు కళాతపస్వి కె విశ్వనాధ్ చేతులు మీదుగా ప్రారంభం అయిన ఈ స్కూల్ విజయవంతంగా సాగుతుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మరియు దర్శకనిర్మాత అయిన మధు మహంకాళి ఈ స్కూల్ ని నడుపుతున్నారు. ప్రముఖ దర్శకుడు అంకురం ఉమామహేశ్వరరావు సారథ్యంలో నిర్వహించబడుతున్న ఈ స్కూల్.. నటన, దర్శకత్వం, ఛాయాగ్రహణం, ఎడిటింగ్ వంటి పలు విభాగాల్లో పలువురిని సుశిక్షితుల్ని చేస్తూ, సినిమా రంగానికి అందిస్తూ వస్తుంది.

Adipurush : ఆదిపురుష్ సెకండ్ డే కలెక్షన్స్ జోరు.. టాక్ ఎలా ఉన్నా 100 కోట్లకు ఏమాత్రం తగ్గడం లేదు..

తాజాగా ఈ స్కూల్ ఆరవ స్నాతకోత్సవం జరుపుకుంది. జూన్ 18, ఆదివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ కార్యక్రమం ఘనంగా జరగగా టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఇక ఈ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతూ.. క్రియేటివిటితో పాటు కృషి, పట్టుదల, అంకితభావం ఉన్నవారికి మాత్రమే సినిమారంగం విజయాలు అందిస్తుందని వ్యాఖ్యానించాడు. ఆ తరువాత విద్యార్థినీ విద్యార్థులకు దిల్ రాజు సర్టిఫికెట్స్, పతకాలు అందించాడు. అలాగే శిక్షణలో భాగంగా స్టూడెంట్స్ తెరకెక్కించిన లఘుచిత్రాల పై ప్రశంసల జల్లు కురిపించాడు. దిల్ రాజుతో పాటు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం, దర్శకనిర్మాత డాక్టర్ గౌతమ్ కూడా విశిష్ట అతిధులుగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

Dil Raju Chief guest for Dadasaheb Phalke School Of Film Studies

Dil Raju Chief guest for Dadasaheb Phalke School Of Film Studies

Dil Raju Chief guest for Dadasaheb Phalke School Of Film Studies

Dil Raju Chief guest for Dadasaheb Phalke School Of Film Studies

 

ట్రెండింగ్ వార్తలు