amp domain was triggered too early. This is usually an indicator for some code in the plugin or theme running too early. Translations should be loaded at the init action or later. Please see Debugging in WordPress for more information. (This message was added in version 6.7.0.) in /var/www/html/10tv/wp-includes/functions.php on line 6122Dil Raju Comments on Pawan Kalyan Regarding Theaters Issue
Dil Raju – Pawan Kalyan : ఇటీవల నిర్మాతలు – ఎగ్జిబిటర్ల మధ్య థియేటర్స్ ఇష్యూ జరుగుతుండగా ఆ వివాదం కాస్త పెద్దది అయి ఏపీ ప్రభుత్వం వరకు వెళ్లడం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ ఘటనతో సినీ పరిశ్రమపై, థియేటర్స్ ఇష్యూపై సీరియస్ అవ్వడం జరిగాయి. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి దుర్గేష్ కూడా ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. దీంతో నిన్న నిర్మాత అల్లు అరవింద్ మీటింగ్ పెట్టగా నేడు దిల్ రాజు ఈ ఇష్యూ గురించి మీటింగ్ పెట్టారు.
ఈ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు అనేదానికి దిల్ రాజు స్పందిస్తూ.. ‘ఒకవేళ కళ్యాణ్ గారికి కోపం వస్తే ఆయన పెద్దన్న తిడతారు పడతాం. ఈ ఘటనతో ఆయన నిజంగానే హర్ట్ అయ్యారు. ఆయన ఒకవేళ తిడితే పడతాం. దాంట్లో తప్పేముంది. కళ్యాణ్ గారిని నేను 22 ఏళ్లుగా చూస్తున్నాను. ఆయన కోపం కూడా నాకు తెలుసు. ఆయనకు కోపం వచ్చేలా జరిగింది కాబట్టే ఆయన సీరియస్ అయ్యారు. కానీ ఆయన సినిమాకు నెగిటివిటి చేయడానికి ఇదే జరిగింది అనే ప్రచారం తప్పు’ అని అన్నారు.
Also Read : Vishnupriya : అందుకే నేను హీరోయిన్ గా చేయకూడదు అని డిసైడ్ అయ్యా.. బాలీవుడ్, తమిళ్ నుంచి ఆఫర్స్ వచ్చాయి..